నేడే తీర్పు: సీఎం కేజ్రీవాల్‌ ఊరట దక్కేనా? | Delhi High Court will announce its verdict today on the bail granted to Chief Minister Arvind Kejriwal. |Sakshi
Sakshi News home page

నేడే తీర్పు: సీఎం కేజ్రీవాల్‌ ఊరట దక్కేనా?

Published Tue, Jun 25 2024 10:06 AM | Last Updated on Tue, Jun 25 2024 11:31 AM

liquor scam: Delhi HC to pronounce verdict on ED plea against kejriwal bail

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్‌ఆద్మీపార్టీ (ఆప్‌) అధినేత కేజ్రీవాల్‌ బెయిల్‌ వ్యవహారంపై ఉత్కంఠ నెలకొంది. మనీ లాండరింగ్‌ కేసులో రౌస్‌ అవెన్యూ ట్రయల్‌ కోర్టు బెయిల్‌ ఇచ్చినా కేజ్రీవాల్‌ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రౌస్‌ అవెన్యూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌ తీర్పుపై ఈడీ పిటిషన్‌ వేయటంతో ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. దీనిపై ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ హైకోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. ఇప్పటికే  ట్రయిల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు విధించిన స్టేపై సీఎం కేజ్రీవాల్‌ ఆదివారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై సోమవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టి.. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర స్టేపై తాము జోక్యం చేసుకోబోమని, హైకోర్టు తుది తీర్పు ఇచ్చిన తర్వాతే విచారిస్తామని సుప్రీం స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్‌ 26కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందని ఆప్‌ నేతల్లో టెన్షన్‌ నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement