
ఆసియాకప్-2025కు ముందు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. కేరళ క్రికెట్ లీగ్(KCL)లో కొచ్చి బ్లూ టైగర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న శాంసన్.. ఆదివారం అరైస్ కొల్లాం సైలర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు.
ఈ మ్యాచ్‌లో సంజూ కేవలం 42 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 237 పరుగుల లక్ష్య చేధనలో ఈ కేరళ ఆటగాడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. అతడి విధ్వంసం ధాటికి గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం బౌండరీలు చిన్నబోయాయి ఓపెనర్‌గా వచ్చిన శాంసన్ తొలి బంతి నుంచే ఎటాక్ మొదలు పెట్టాడు.

ఈ క్రమంలో శాంసన్ తన తొలి కేసీఎల్ హాఫ్ సెంచరీని కేవలం 16 బంతుల్లోనే అందుకున్నాడు. తద్వారా కేరళ క్రికెట్ లీగ్ చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా శాంసన్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు అబ్దుల్ బాజిత్ పేరిట ఉండేది. అతను 22 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. తాజా మ్యాచ్‌తో బాజిత్‌ను శాంసన్ అధిగమించాడు. ఇక ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 51 బంతులు ఎదుర్కొన్న శాంసన్.. 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 121 పరుగులు చేశాడు.
ఆఖరి బంతికి గెలిపించిన ఆషిక్..
అయితే అప్పుడు వరకు దూకుడుగా ఆడిన శాంసన్‌ను కొల్లాం పేసర్ బిజు నారాయణన్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేయడంతో మ్యాచ్ స్వరూపామే మారిపోయింది. ఆఖరి ఓవర్‌లో కొచ్చి విజయానికి 17 పరుగులు అవసరమయ్యాయి.
ఈ సమయంలో కొచ్చి బ్యాటర్ ముహమ్మద్ ఆషిక్ అద్భుతం చేశాడు. తొలి రెండు బంతుల్లో సిక్స్, ఫోరు బాదడంతో గెలుపు సమీకరణం నాలుగు బంతుల్లో 7 పరుగులగా మారింది. అయితే తర్వాత రెండు బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే వచ్చాయి.
దీంతో ఆఖరి రెండు బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి. ఐదో బంతికి ఎటువంటి పరుగు రాలేదు. ఈ క్రమంలో చివరి బంతికి ఆషిక్ సిక్స్ కొట్టి తన జట్టు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఆషిక్ కేవలం 18 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 45 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
ఓపెనర్‌గా వస్తాడా?
కాగా ఆసియాకప్‌కు శాంసన్ ఎంపికైనప్పటికి తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఎందుకంటే రెగ్యూలర్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ తిరిగి టీ20 జట్టులోకి వచ్చాడు. దీంతో ఆసియాకప్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ను అభిషేక్ శర్మ, గిల్ ప్రారంభించే అవకాశముంది.
అయితే టీ20ల్లో సంజూకు ఓపెనర్‌గా తప్ప మిడిలార్డర్‌లో అంత మంచి ట్రాక్ రికార్డు లేదు. దీంతో అతడి స్ధానంలో జితేష్ శర్మ వికెట్ కీపర్‌గా ఛాన్స్ లభించినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కానీ ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ శాంసన్ అద్భుత శతకంలో సెలక్టర్లకు సవాలు విసిరాడు.