రాణించిన కివీస్ బ్యాట‌ర్లు.. భార‌త్ ముందు భారీ టార్గెట్‌ | IND vs NZ: Mitchell 84 Helps New Zealand Sets 300 Target | Sakshi
Sakshi News home page

IND vs NZ 1st ODI: రాణించిన కివీస్ బ్యాట‌ర్లు.. భార‌త్ ముందు భారీ టార్గెట్‌

Jan 11 2026 5:25 PM | Updated on Jan 11 2026 5:46 PM

IND vs NZ: Mitchell 84 Helps New Zealand Sets 300 Target

రాజ్‌కోట్ వేదిక‌గా వ‌డోద‌ర వేదిక‌గా జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో న్యూజిలాండ్ బ్యాట‌ర్లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 300 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. బ్లాక్ క్యాప్స్ జట్టుకు ఓపెనర్లు హెన్రీ నికోల్స్ (62), డెవాన్ కాన్వే (56) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. 

వీరిద్దరూ మొదటి వికెట్‌కు 117 పరుగులు జోడించి భారత బౌలర్లపై ఒత్తిడి పెంచారు. నికోలస్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విల్ యంగ్(12) ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. డెవాన్ కాన్వే కూడా వెంటనే పెవిలియన్‌కు చేరాడు. అయితే మిడిలార్డర్‌లో సీనియర్ బ్యాటర్ డారిల్ మిచెల్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

మిచెల్‌ 71 బంతుల్లో 5 ఫోర్లు, 33 సిక్స్‌లతో 84 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆఖరిలో అరంగేట్ర ఆటగాడు క్లార్క్‌(24) రాణించాడు. భారత బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, హర్షిత్‌ రానా తలా రెండు వికెట్లు సాధించారు. కుల్దీప్‌ యాదవ్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.

తుది జట్లు
భారత్‌: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(కెప్టెన్‌), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్(వికెట్‌కీపర్‌), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

న్యూజిలాండ్‌: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(వికెట్ కీపర్‌), మైఖేల్ బ్రేస్‌వెల్(కెప్టెన్‌), జకారీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement