
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్(Sanju Samson) తొలిసారి కేరళ క్రికెట్ లీగ్ (KCL)లో ఆడనున్నాడు. శనివారం తిరువనంతపురంలో జరిగిన కేసీఎల్ సీజన్-2 ఆటగాళ్ల వేలంలో శాంసన్‌ను కొచ్చి బ్లూ టైగర్స్ రూ. 26.80 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది.
తద్వారా కేరళ క్రికెట్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా సంజూ నిలిచాడు. అతడి కోసం కొచ్చి ఫ్రాంచైజీ తమ పర్స్‌లో ఉన్న సగానికిపైగా మొత్తాన్ని వెచ్చింది. తొలుత శాంసన్ బిడ్డింగ్ పోరు రూ.5 లక్షలతో ప్రారంభమైంది. త్రిస్సూర్ టైటాన్స్ ఒక్కసారిగా రూ.20 లక్షలకు బిడ్‌ను పెంచింది.
అయితే ఆఖరికి కొచ్చి 26.80 లక్షలు వెచ్చించి అతడిని కైవసం చేసుకుంది. వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలకు కేసీఎల్ మెనెజ్‌మెంట్ రూ. 50 లక్షలు కేటాయించింది. ఇప్పుడు సంజూ శాంసన్‌పైనే 26.80 లక్షలు వెచ్చించడంతో కొచ్చి వద్ద రూ. 23.2 లక్షలే మిగిలియాయి. దీంతో వేలంలో మిగితా స్టార్ ప్లేయర్లను సొంతం చేసుకోవడం కొచ్చి కష్టం కావచ్చు.
ఈ వేలం ముందువరకు కెసీఎల్‌లో అత్యధిక ధర కలిగిన రికార్డు ఎం. సజీవన్ పేరిట ఉండేది. తొలి ఎడిషన్‌లో సజీవన్‌ను త్రివేండ్రం రాయల్స్ రూ.7.4 లక్షలకు సొంతం చేసుకుంది. ఇప్పుడు సంజూ ఆ రికార్డును బద్దలు కొట్టాడు.
ఈ ఏడాది వేలంలో సంజూ కంటే ముందు బాసిల్ తంపిని రూ.8.4 లక్షలకు తివేండ్రం రాయల్స్ సొంతం చేసుకుంది. సంజూ ప్రస్తుతం భారత టీ20 జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు. అయితే ఈ మధ్యలో టీ20 సిరీస్‌లు లేకపోవడంతో కెసీఎల్ టోర్నీ మొత్తానికి అందుబాటులో ఉండనున్నాడు. కెసీఎల్ సీజన్-2 ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 6 వరకు జరగనుంది.
చదవండి: IND vs ENG: రివ్యూ తీసుకున్న జైశ్వాల్.. అంపైర్‌పై కోపంతో ఊగిపోయిన స్టోక్స్! వీడియో