
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన సహనాన్ని కోల్పోయాడు. ఫీల్డ్ అంపైర్‌తో స్టోక్స్ తీవ్ర వాగ్వాదానికి దిగాడు. అసలేమి ఏమి జరిగిందంటే.. టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్‌లో పేసర్ జోష్ టంగ్ వేసిన బంతి జైస్వాల్ ప్యాడ్‌ను తాకింది.
దీంతో ఇంగ్లండ్ ఆటగాళ్లతో పాటు బౌలర్ కూడా ఎల్బీ కోసం అప్పీల్ చేశాడు. వెంటనే అంపైర్ షర్ఫుద్దౌలా ఔట్ అంటూ వేలు పైకెత్తాడు. ఈ క్రమంలో జైశ్వాల్ డీఆర్‌ఎస్ తీసుకోవాలా? వద్దా అని? నాన్‌స్ట్రైకర్‌లో ఎండ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌తో చర్చించాడు. కొద్దిసేపు మాట్లాడకున్నాక జైశ్వాల్ చివరకు రివ్యూ కోసం వెళ్లాడు.
అయితే జైస్వాల్ రివ్యూ అడగడానికి ముందే 15 సెకన్ల టైమర్ ముగిసినట్లు బిగ్ స్క్రీన్‌పై కన్పించింది. అయినప్పటికి అంపైర్ మాత్రం రివ్యూకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దీంతో స్టోక్స్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగాడు.
మైదానంలో ఉన్న ఇంగ్లండ్ అభిమానులు సైతం అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆ సమయంలో స్టాండ్స్ నుంచి బిగ్గరగా అరుపులు వినిపించాయి. అయితే రిప్లేలో మాత్రం బంతి స్టంప్స్‌ను హిట్‌చేస్తున్నట్లు తేలడంతో జైశ్వాల్(28) మైదానాన్ని వీడక తప్పలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
చదవండి: IND vs ENG: ఉత్కంఠ పోరు.. ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) July 4, 2025
Josh Tongue gets Jaiswal trapped in front! ☝️
🇮🇳 5️⃣1️⃣-1️⃣ pic.twitter.com/raWBqQXjv4— England Cricket (@englandcricket) July 4, 2025