
లండన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో 5 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు ఓటమిపాలైంది. ఆఖరివరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో భారత్‌పై ఇంగ్లండ్ పై చేయి సాధించింది. చివరి ఓవర్‌లో టీమిండియా విజయానికి 12 పరుగులు అవసరమయ్యాయి.
క్రీజులో హర్మన్ ప్రీత్ కౌర్ ఉండడంతో మన అమ్మాయిలు విజయం సాధిస్తారని అంతా భావించారు. కానీ ఆ ఓవర్ వేసిన ఇంగ్లండ్ పేసర్ లారెన్ బెల్ అద్బుతంగా బౌలింగ్ చేసి తొలి ఐదు బంతుల్లో 6 పరుగులే మాత్రమే ఇచ్చింది. చివరి బంతికి ఆరు పరుగులు అవసరం కాగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ క్యాచ్ ఔటైంది.
దీంతో 172 పరుగుల లక్ష్య చేధనలో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 166 పరుగులే చేయగల్గింది. భారత బ్యాటర్లలో ఓపెనర్లు స్మృతి మంధాన (56: 49 బంతుల్లో 10 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయగా, షఫాలీ వర్మ (47: 25 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగింది. అయితే మంధాన ఎక్కువ బంతులు ఆడేయడంతో మిడిలార్డర్‌పై ఒత్తిడిపెరిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ ఫైలర్ రెండు, ఎకిలిస్టోన్, వాంగ్ తలా వికెట్ సాధించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్లు సోఫియా డంక్లీ (75: 53 బంతుల్లో 7 ఫోర్లు ఒక సిక్స్), వ్యాట్ హాడ్జ్ (66: 42 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
భారత బౌలర్లలో అరుంధతీ రెడ్డి 3, దీప్తి శర్మ 3, శ్రీ చరణి 2, రాధా యాదవ్ ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో ఇంగ్లండ్ సిరీస్ ఆశలను సజీవగా ఉంచుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-2తో భారత్ ఆధిక్యంలో కొనసాగుతోంది. మిగిలిన రెండు మ్యాచ్‌లో ఒక్కదాంట్లో గెలిస్తే చాలు సిరీస్ భారత్ సొంతమవుతోంది. ఇక ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 మాంచెస్టర్ వేదికగా జరగనుంది.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన యశస్వి జైశ్వాల్.. తొలి భారత ప్లేయర్‌గా