‍మొన్ననే ఎంతో ఉత్సాహంగా కనిపించారు.. కానీ ఇప్పుడు | Singer S Janaki Last Video With Singer Sunitha | Sakshi
Sakshi News home page

S Janaki Last Video: గాయని జానకి మృతి.. చివరి వీడియో వైరల్

Jul 11 2026 9:45 PM | Updated on Jul 12 2026 11:46 AM

Singer S Janaki Last Video With Singer Sunitha

ప్రఖ్యాత సింగర్ ఎస్.జానకి చివరి వరకు పాటల సవ్వడులతోనే సావాసం చేశారు. 2016లో రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఆమె పాటలు వినపడుతున్నంత కాలం మన మనసుల్లో ఎప్పటికీ సజీవంగాన ఉంటారు. అయితే ఈమెకు సంబంధించిన చివరి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాల మధ్య జానకి ప్రశాంత మరణం)

ఈ ఏడాది మార్చి చివరి వారంలో టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత.. చెన్నైలోని జానకమ్మ ఇంటికి వెళ్లారు. ఆమె పాదాల దగ్గర కూర్చొని పాటలు పాడగా గాన సరస్వతి ఎంతో ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. సంతోషంగా సునీతని ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత ఎన్నాళ్లు కాలేదు ఇప్పుడు ఇలా తుదిశ్వాస విడిచారు. దీంతో సంగీత ప్రేమికులు శోకసంద్రంలో మునిగిపోయారు.

60 ఏళ్ల కెరీర్‌లో దాదాపు 50 వేలకు పైగా 17 భాషల్లో పాటలు పాడిన జానకమ్మ.. సంగీత ప్రపంచంలో అద్భుతమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. పదేళ్ల క్రితం ఆమె రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ ఈమె పాడిన పాటలు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

(ఇదీ చదవండి: జానకి పాడిన చివరి పాట ఏంటంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement