breaking news
latest video footage
-
మొన్ననే ఎంతో ఉత్సాహంగా కనిపించారు.. కానీ ఇప్పుడు
ప్రఖ్యాత సింగర్ ఎస్.జానకి చివరి వరకు పాటల సవ్వడులతోనే సావాసం చేశారు. 2016లో రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఆమె పాటలు వినపడుతున్నంత కాలం మన మనసుల్లో ఎప్పటికీ సజీవంగాన ఉంటారు. అయితే ఈమెకు సంబంధించిన చివరి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాల మధ్య జానకి ప్రశాంత మరణం)ఈ ఏడాది మార్చి చివరి వారంలో టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత.. చెన్నైలోని జానకమ్మ ఇంటికి వెళ్లారు. ఆమె పాదాల దగ్గర కూర్చొని పాటలు పాడగా గాన సరస్వతి ఎంతో ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. సంతోషంగా సునీతని ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత ఎన్నాళ్లు కాలేదు ఇప్పుడు ఇలా తుదిశ్వాస విడిచారు. దీంతో సంగీత ప్రేమికులు శోకసంద్రంలో మునిగిపోయారు.60 ఏళ్ల కెరీర్లో దాదాపు 50 వేలకు పైగా 17 భాషల్లో పాటలు పాడిన జానకమ్మ.. సంగీత ప్రపంచంలో అద్భుతమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. పదేళ్ల క్రితం ఆమె రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ ఈమె పాడిన పాటలు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.(ఇదీ చదవండి: జానకి పాడిన చివరి పాట ఏంటంటే?) View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
కాల్పులు జరిపి.. తాపీగా వెళ్లారు!
ఫ్రాన్సులో చార్లీ హెబ్డో పత్రికపై దాడులకు తెగబడ్డ నరహంతకులకు సంబంధించి తాజా వీడియో ఫుటేజ్ బయటకొచ్చింది. పత్రిక ఉద్యోగులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఇద్దరు ఉగ్రవాదులు పారిస్ రోడ్డుపై చాలా ప్రశాంతంగా కనిపించారు. నిదానంగా తుపాకుల్ని తుడుచుకుంటా గడిపారు. ఒకతను కార్లో కూర్చునే ప్రయత్నం చేయగా మరొకడు... ప్రతీకారం తీర్చుకున్నామని నినాదాలు చేయడం సీసీ కెమెరాలో చాలా స్పష్టంగా రికార్డయింది. ఎక్కడా తొందరగా వెళ్లాలనే ఆత్రం కానీ, తప్పు చేశామన్న భావన గానీ వాళ్లలో కనిపించలేదు. నిదానంగా కారు నడిపించుకుంటూ వెళ్లిన వాళ్లను ఓ పోలీసు కారు వెంబడించింది. పోలీసులు వెంటపడుతున్నారని గుర్తించిన ఉగ్రవాదులు కారు ఆపేసి ఆ వ్యాన్‌పై కాల్పులు జరిపారు. దాంతో పోలీసు వ్యాన్ వెనక్కి వెళ్లిపోవాల్సిన వచ్చిన దృశ్యాలు ఈ ఫుటేజ్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి. ప్యారిస్‌లోని చార్లీ హెబ్డో పత్రికపై గత వారం జరిగిన దాడిలో పది మంది ఆ పత్రిక ఉద్యోగులు, ఇద్దరు పోలీసులు చనిపోయారు.


