దురంధర్, బోర్డర్‌-2 కాదు.. ఆ చిన్న సినిమానే నంబర్‌వన్..! | Priyanka Mohan Movie Made in Korea top Trending in Ott in second week | Sakshi
Sakshi News home page

Priyanka Mohan: దురంధర్, బోర్డర్‌-2 చిత్రాల వెనక్కి నెట్టేసిన చిన్న సినిమా.!

Mar 25 2026 3:49 PM | Updated on Mar 25 2026 4:05 PM

Priyanka Mohan Movie Made in Korea top Trending in Ott in second week

ప్రియాంక మోహన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఓటీటీ చిత్రం మేడ్‌ ఇన్‌ కొరియా. ఆర్‌.ఏ కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 12న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది.  తన కోరికతో కొరియా వెళ్లిన యువతి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందన్న కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీపై పలువురు సౌత్‌ స్టార్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.  ముఖ్యంగా ప్రియాంక మోహన్‌ నటనను కొనియాడుతున్నారు.

ఈ మూవీ ఓటీటీకి వచ్చిన తొలివారంలోనే నంబర్‌ ప్లేస్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. రెండు వారాలు పూర్తి అయినా కూడా ఈ సినిమాకు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. నెట్‌ఫ్లిక్స్‌లో నానా-ఇంగ్లీష్ కేటగిరీలో బోర్డర్-2, దురంధర్‌ చిత్రాలను వెనక్కి నెట్టి మొదటిస్థానంలో కొనసాగుతోంది. ఈ విషయాన్ని డైరెక్టర్ కార్తీక్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

వరుసగా రెండవ వారం కూడా  మేడ్ ఇన్ కొరియా ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవ్వడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. మొట్టమొదటిసారిగా ఒక దక్షిణాది చిత్రం ఇటువంటి ప్రపంచ స్థాయి గుర్తింపును సాధించడం మరింత ప్రత్యేకంగా నిలిచిందని రాసుకొచ్చారు. ఈ మూవీకి వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన మీ ప్రేమకు, సందేశాలకు, ఫోన్ కాల్స్‌కు ధన్యవాదాలు.. మీ అందరికీ కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు. ఓ మహిళా ఓరియంటెడ్ మూవీ ఇంతటి ఆదరణను పొందడం మాకు ఎంతో గర్వకారణమన్నారు. ప్రియాంక మోహన్.. నీ  నీ కృషికి తగిన ఫలితం రావడం నాకు చాలా సంతోషంగా ఉందని రాసుకొచ్చారు. కాగా.. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement