'ధురంధర్ 2' కోసం రణవీర్‌ సింగ్‌ ఆరు వారాల్లోనే ఏకంగా పదికిలోలు..! | How Ranveer Singh Gained 10 Kg In 6 Weeks For Dhurandhar Movie | Sakshi
Sakshi News home page

'ధురంధర్ 2' కోసం రణవీర్‌ సింగ్‌ ఆరు వారాల్లోనే ఏకంగా పదికిలోలు..!

Mar 25 2026 3:27 PM | Updated on Mar 25 2026 4:05 PM

How Ranveer Singh Gained 10 Kg In 6 Weeks For Dhurandhar Movie

రణ్‌వీర్ సింగ్ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ధురంధర్ 2' మూవీ రికార్డు రేంజ్‌ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మార్చి 19న ప్రారంభమైన వసూళ్ల వేట ఐదురోజుల వరకు అలానే కొనసాగుతూ వెళ్తోందంటే ఆ సినిమా క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ మూవీలో స్పై  హంజా అలీ మజారిగా నటించిన రణవీర్‌ సింగ్‌ ఈ పాత్ర కోసం ఎంతలా కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పాత్రలో ఒదిగిపోయేలా క్రూరంగా కనిపించేందుకు చాలా తక్కువ టైంలోనే పదికిలోలు పైనే బరువు పెరిగారట. విలక్షణ పాత్రలతో అభిమానులను మెప్పించే రణవీర్‌ ఫిజిక్‌ పరంగా చాలా కేర్‌ తీసుకుంటారట. అది కూడా ఆరోగ్యకరమైన రీతీలోను ఉంటుందని, ఎలాంటి షార్టకట్‌లు ఫాలో అవ్వరని చెబుతున్నాడు అతని ఫిట్‌నెస్‌ కోచ్‌. అంత తక్కువ వ్యవధిలో రణవీర్‌ శరీరాన్ని అంతలా ఎలా మార్చగలిగాడో తెలుసుకుందామా..!.

గత కొన్నేళ్లుగా, నటుడిగా రణవీర్ సింగ్‌ విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా 'ధురంధర్: ది రివెంజ్' చిత్రంలో ఆయన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అంతలా అభిమానులను కట్టిపడేసేలా తెరపై ఆ పాత్రను పండించడం కోసం రణవీర్‌ ఎంతలా కష్టపడ్డారో వింటే నోటమాట రాదు.  ఆ విషయాన్ని స్వయంగా ఆ మూవీలో నటించని సహనటుడు, సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ కోచ్‌ ముస్తఫా అహ్మద్ వెల్లడించారు. ఆయన 'ధురంధర్: ది రివెంజ్'లో రిజ్వాన్‌ షా పాత్రలో ఒదిగిపోయారు. ఫిట్‌నెస్‌ కోచ్‌ ముస్తఫా రణవీర్‌ సింగ్‌ తెరపై క్రూరంగా కనిపంచడం కోసం కేవలం ఆరు వారాల్లోనే పదికిలోల బరువు పెరిగారట. 

నిజానికి షూటింగ్‌ చేసే సమయం తక్కవు ఉండటంతో చాలా తక్కువ వ్యవధిలోనే రణవీర్‌సింగ్‌ బరువు పెరగక తప్పని పరిస్థితని చెప్పుకొచ్చారు. రణవీర్‌ దాదాపు పదికిలోలు దాక పెరగాల్సి ఉంది. అయితే ఆ టైంకి రణవీర్‌ బరువు కేవలం 76 నుంచి 77 కిలోలు ఉన్నట్లు తెలిపారు. అయితే షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి రణవీర్‌ ఏకంగా 87-88 కిలోలకు చేరి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రణవీర్‌కి ఏ పని అప్పగించినా ఓ యంత్రంలా చేసేస్తారని అంటున్నాడు కోచ్‌ ముస్తఫా. తాను రోజుకు 3,000-3,600 కేలరీలు తీసుకుంటుండగా, రణ్‌వీర్ తీసుకునేది రోజుకు 3,600 నుండి 4,000 కేలరీలు. అందులో ఎక్కువ భాగం  600-700 కేలరీలు ప్రోటీన్ షేక్‌ల నుంచే ఎక్కువగా తీసుకుంటున్నారు. అంటే రోజుకు రెండు ప్రోటీన్‌ షేక్‌లు, 240 గ్రాముల ప్రోటీన్‌ కోసం చికెన్‌, మటన్‌ ఎక్కువుగా తీసుకునేవాడట. 

 

తాను ఆరువారాల్లో కేవలం రెండు నెలలు మాత్రమే ట్రైన్‌ చేశానని, మిగతా మొత్త ఆయన స్వయంగా కేర్‌ తీసుకున్నదేనని అంటున్నాడు. షూటింగ్‌ షెడ్యూల్‌ రీత్యా పూర్తి స్థాయిలో ఆయనకు శిక్షణ ఇవ్వకపోయినా రణవీర్‌ తన పాత్ర బాగా కనిపించాలనే ఉద్దేశ్యతో చాలా జాగ్రత్తతు తీసుకుంటారని, ఆ విషయంలో ఆయనకు సాటిరారెవ్వరూ అని ప్రశంసిస్తున్నాడు. శ్వాసను మెరుగుపరుచుకుంటూ..వెయిట్‌ ట్రైనింగ్‌ చేస్తాడు. చాలామంది శరీరం కండలు తిరిగిన దేహంలా కనిపించేలా చేస్తే..ఆయన మాత్రం బలంతో కూడిన కండరాల కోసం  ప్రయత్నిస్తాడని అన్నారు. 

తెరపై అతడు చాలా సమర్థుడైన వ్యక్తిలా కనిపించేందుకు భోజన విరామ సమయంలో సైతం వెయిట్ ట్రైనింగ్ చేసేవాడని అన్నారు. అలా చేస్తే ఫిట్‌నెస్‌ కోచ్‌కి ట్రైనింగ్‌ సులభతరం అవుతుందని చెబుతున్నాడు. ఇక్కడ రణవీర్‌ ఫిట్‌నెస్‌ నిపుణుల పర్యవేక్షణలో చాలా ఆరోగ్యకరమైన రీతీలోనే బరువు పెరిగారనేది గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం. కాగా, రణవీర్‌ సింగ్‌, ముస్తఫా ఈ మూవీ కోసం దాదాపు 16 నుంచి 18 గంటలు చిత్రీకరణలో పాల్గొన్నారట.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

 

(చదవండి: కూరగాయలు అమ్ముతూ.. కోట్లకు పడగలెత్తిన యువకుడు!)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement