ఫైల్ ఫోటో(టీ షర్ట్‌లో ఉన్న వ్యక్తే అభిషేక్ ఆర్ వైశ్య)
మన చుట్టూనే ఎందరో కష్టజీవులు ఉన్నారు. తమ కష్టంతో తలరాతలనే మార్చుకుని అద్భుతాలు సృష్టిస్తున్నావారెందరో ఉన్నారు. అలాంటి కోవకు చెందినవాడే ఈ యువకుడు. సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్‌లో పాడ్‌కాస్టర్ కుశల్ షేర్ చేసిన ఆ యవకుడి కథ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు, స్ఫూర్తిదాయకమైన కథ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టడం విశేషం. చుట్టూ పరిమిత వనరులు..నిరంతర శ్రమతో కూడిన జీవితం నుంచి పైకొచ్చిన యువకడి స్టోరీ ఇది.!.
ఆ అబ్బాయే ముంబైకి చెందిన అభిషేక్ ఆర్ వైశ్య. టీనేజ్ వయసు నుంచే వృత్తి జీవితం మొదలైంది. సుమారు 13 నుంచి 20 సంవత్సరాల వయసులో అతను ముంబైలోని అత్యంత రద్దీప్రాంతమైన దాదర్‌లో కూరగాయలు అమ్ముతూ తండ్రికి చేదుడువాదోడుగా ఉండేవాడు. ప్రతిరోజు అతడి దినచర్య సూర్యోదయానికి ముందే ప్రారంభమయ్యేది.
ఉదయం 4 నుంచి 6 గంటల మధ్య కూరగాయల అమ్మకాలు చూసుకునేవాడు. ఆ తర్వాత ఏ మాత్రం విరామం లేకుండా సీఏ కోచింగ్ క్లాసులకు వెళ్లిపోయేవాడు. అలా ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు క్లాసులతో సరిపోయేది. ఆ క్లాసులు ముగిశాక, అతను రోజంతా ఆర్టికల్ షిప్ శిక్షణకు కేటాయించుకునేవాడు. సీఏ కోర్సులో భాగంగా ప్రాక్టీకల్ అనుభవం కోసం చేసే సీనియర్ సీఏ వద్ద చేసే ట్రైనింగ్ ఈ ఆర్టికల్ షిప్. ఇక రాత్రి 11 గంటల టైంకి ఫ్రీ టైం దొరుకుతుంది.
ఇక ఆ సమయంలో చదువుకోవడానికి సమయం కేటాయించుకునేవాడు. పైగా ఉండే గది కూడా కేవలం 150 చదరపు అడుగుల చిన్న గది. పరిమిత స్థలం, పరిమిత వనురులే అయినప్పటికీ..ఎదగాలన్న తాపత్రయం, కసి పుష్కలంగా ఉండేవి. అవి అతడిని..అంత కష్టాన్ని భరించే శక్తిని ఇచ్చేవి. అలా అతడు సీఏ ఉత్తీర్ణుడై..విదేశాలకు వెళ్లాడు. అలా ఒమన్‌కు వెళ్లి అక్కడ ఆరేళ్లు పనిచేసి, వృత్తిపరమైన అనుభవాన్ని పొందాడు. చివరికి వ్యవస్థాపకరంగంలోకి అడుగుపెట్టి.. సొంత వ్యాపారాలతో సంపదను పెంచుకున్నాడు. మంచి స్థాయిలోకి వచ్చాక చేసిన మొదటి పని తండ్రిని ఆ కూరగాయలు అమ్మే పని నుంచి మానిపించేయడం.
ఆ తర్వాత భారత్, దుబాయ్, ఒమన్ వంటి చోట్ల మొత్త ఐదు ఫ్లాట్‌లు కొనుగులు చేశాడు. పైగా బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ వంటి విలాసవంతమైన కార్ల తోపాటు ఒమన్‌లో అతడికి అత్యంత ప్రజాదరణ పొందిన క్లౌడ్‌కిచెన్ వ్యాపారాన్ని కూడా రన్ చేస్తుండటం విశేషం. పట్టుదలతో చక్కగా కెరీర్‌ని తీర్చిదిద్దుకున్న అతడి కథను వివరిస్తూ..పాడ్‌కాస్టర్ కుశల్ ఇలా అన్నారు. అభిషేక్‌ను వ్యక్తిగతంగా కలవడం తనపై చెరగని ముద్ర వేసిందన్నారు.
అతనిపై మరింత గౌరవం పెరిగిందని చెప్పారు. మనం కోరుకున్న లక్ష్యంవైపుకి వెళ్లడం కోసం ఎంతలా కష్టపడాలి, ఎంతటి పట్టుదల ఉండాలో తెలిసి వచ్చిందని కుశాల్‌లోధా అన్నారు. అతడితో సంభాషణ స్ఫూర్తిదాయకంగానే కాదు పట్టుదలతో ప్రయత్నిస్తే ఎంతటి ఆశయాన్ని అయినా పాదాక్రాంతం చేసుకోవచ్చనే నమ్మకాన్ని ఇచ్చిందన్నారు.
He used to sell vegetables at Dadar with his father from age 13-20.
He used to sell vegetables early in the morning from 4 to 6 AM, then go for his CA Final classes from 7-10 AM, then go for articleship from 10 AM – 9 PM, study for a bit, and then sleep by 11 PM.
He used to… pic.twitter.com/ihRK4OG39g— Kushal Lodha (@kushallodha548) March 19, 2026
(చదవండి: ఐదుగురు పిల్లల తల్లి!.. ఏకంగా 67 కిలోల బరువు తగ్గి ఇలా..)


