ఎట్టకేలకు ఓటీటీలోకి 'అవతార్ 3' సినిమా | Avatar 3 Movie OTT Update Streaming Details | Sakshi
Sakshi News home page

Avatar 3 OTT: దాదాపు మూడు నెలల తర్వాత 'అవతార్ 3' స్ట్రీమింగ్

Mar 25 2026 1:44 PM | Updated on Mar 25 2026 2:46 PM

Avatar 3 Movie OTT Update Streaming Details

'అవతార్' సినిమాల గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకు మూడు భాగాలు రిలీజ్ కాగా.. మరో రెండు పార్ట్ థియేటర్లలోక రావాల్సి ఉంది. అయితే 2009లో వచ్చిన తొలి పార్ట్ అద్భుతమైన హిట్ కాగా.. 2022లో వచ్చిన సీక్వెల్ పర్లేదు బాగానే ఉందనే రెస్పాన్స్ అందుకుంది. గతేడాది డిసెంబరులో రిలీజైన మూడో పార్ట్‌ చాలా మందికి నచ్చలేదు. కానీ కలెక్షన్స్ మాత్రం రూ.12 వేల కోట్లకు పైనే వచ్చాయి. అందరూ ఈ మూవీ గురించి దాదాపు మర్చిపోయారు. ఇలాంటి టైంలో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

(ఇదీ చదవండి: ధురంధర్‌ 2 ఎఫెక్ట్‌.. స్టార్‌ హీరో సినిమా వాయిదా)

జేమ్స్ కామెరూన్ తీసిన మూడో భాగం 'అవతార్ ఫైర్ అండ్ యాష్'.. గతేడాది డిసెంబరు 19న పెద్దగా అంచనాల్లేకుండానే థియేటర్లలోకి వచ్చింది. అనుకున్నట్లే పెద్దగా మెప్పించలేకపోయింది. గ్రాఫిక్స్ బాగున్నప్పటికీ మళ్లీ అదే టైపు స్టోరీ కావడంతో జనాలు లైట్ తీసుకున్నారు. కొందరు మాత్రం చూశారు. అలా కొన్నాళ్ల పాటు థియేటర్లలో ప్రదర్శితమైంది. ఇప్పుడు దాదాపు మూడు నెలల తర్వాత అంటే ఈ నెల 31 నుంచి అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీల్లో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ కానుంది.

అమెజాన్ ప్రైమ్‌లో ఇంగ్లీష్‌లో మాత్రమే స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే మన దగ్గర డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న హాట్‌స్టార్‌లో ఏప్రిల్ లేదా మే నెలలో ప్రాంతీయ భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, హిందీలోనూ అందుబాటులోకి వచ్చే అవకాశముందని మాట్లాడుకుంటున్నారు. మరి మన దగ్గర థియేటర్లలో రూ.225 కోట్ల మేర వసూళ్లు మాత్రమే రాబట్టిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి?

'అవతార్ 3' విషయానికొస్తే.. రెండో పార్ట్ 'అవతార్: ద వే ఆఫ్ వాటర్' సంఘటనల తర్వాత జేక్ సల్లీ (శ్యామ్ వర్తింగ్టన్), నేతిరి (జో సల్దానా) జంట తమ పెద్ద కొడుకు కోల్పోయిన బాధలో ఉంటారు. పిల్లలతో కలిసి జీవిస్తుంటారు. తన వల్లే సోదరుడు చనిపోయాడనే అపరాధ భావంతో జేక్ కొడుకు లోక్ ఉంటాడు. రెండో భాగంలో చనిపోయిన కల్నల్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్).. నావీ తెగకు చెందిన వ్యక్తిలా మళ్లీ వచ్చి జేక్‌పై ప్రతీకారానికి సిద్ధమవుతాడు. ఈసారి కల్నల్‪కి అగ్ని తెగకు చెందిన నాయకురాలు వరంగ్ (ఊనా చాప్లిన్) తోడవుతుంది. వీళ్లకు ఆర్డీఏ బృందం కూడా తోడవుతుంది. మరి ఇంతమంది శత్రువుల్ని జేక్ కుటుంబం ఎలా ఎదుర్కొంది? చివరకు ఏమైందనదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఇవే.. వీడియోలు వైరల్)

Advertisement
 
Advertisement
Advertisement