హైదరాబాద్: పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరా ఆగిపోతుందని, కొరత ఏర్పడుతుందని, ధరలు పెరుగుతాయనే ఊహాగానాలతో నగరంలో వాహనదారులు తీవ్ర ఆందోళన చెందారు.
మంగళవారం ఉప్పల్, మల్లాపూర్, అత్తాపూర్, చాంద్రాయణగుట్ట, మలక్‌పేట వంటి అనేక ప్రాంతాల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిచ్చాయి. తెరిచి ఉన్న బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనదారులు పోటెత్తారు.
రాత్రివేళకు సగానికి పైగా పెట్రోల్ బంకులు స్టాక్ లేక మూతపడ్డాయి. తెరిచి ఉన్న బంకులు వాహనదారులతో కిక్కిరిసిపోయాయి.


