కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ మూవీ ‘యూత్’. ఈ చిత్రం ఈ నెల 26న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో ఈ సినిమా ఒక రోజు ఆలస్యంగా ఈ నెల 27న థియేటర్స్ లోకి రాబోతోంది. పెయిడ్ ప్రీమియర్స్ పై ప్రకటన చేస్తామని ప్రొడ్యూసర్స్ వెల్లడించారు. ఇప్పటికే తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఈ2సీ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్.
ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు. 'కమ్ విత్ యువర్ గ్యాంగ్, నోట్ - నో ఏజ్ లిమిట్' అనే స్లోగన్ తో ఈ సినిమా ప్రమోషనల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ కు, సాంగ్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. యూత్ ఆడియెన్స్ ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


