బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అద్దంకి నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ భేటీ
ఈ భేటీలో పాల్గొన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున, అద్దంకి నియోజకవర్గ ఇంఛార్జి డా.అశోక్ కుమార్‌తో పాటు ఇతర ముఖ్య నేతలు
చంద్రబాబు మాటలు కోటలు దాటాయి: వైఎస్ జగన్
చంద్రబాబు క్రెడిట్ దోపిడీ చేస్తూనే ఉన్నారు
మిట్టల్ స్టీల్‌ప్లాంట్ వ్యవహారంలోనూ చంద్రబాబు క్రెడిట్ చోరీ
2022 దావోస్‌పర్యటనలోఓ ఆదిత్య మిట్టల్ నాతో సమావేశమయ్యారు
ఎస్‌ఆర్ స్టీల్‌ను కొనుగోలు చేసి మన హయాంలో వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టారు
కొత్త స్టీల్‌ప్లాంట్ పెడతామంటే మేం ఆహ్వానించాం.
కాకినాడ, మూలపేట, నక్కపల్లిలో భూములు చూపించాం
ఎన్నికలకు ముందు వచ్చి నక్కపల్లిని ఎంపిక చేసుకున్నారు
ఇప్పుడు తనను చూసి స్టీల్ప్లాంట్వచ్చినట్లుగా చంద్రబాబు బిల్డప్
గూగుల్ విషయంలోనూ చంద్రబాబు ఇలాగే క్రెడిట్ దోపిడీ చేస్తున్నారు


