సంజయ్ దత్‌ క్రేజీ రికార్డ్.. ఆ విషయంలో తొలి నటుడిగా ఘనత..! | Sanjay Dutt Create record 3 Movies gets Rs 1000 crore at Box office | Sakshi
Sakshi News home page

Sanjay Dutt: సంజయ్ దత్‌ క్రేజీ రికార్డ్.. ఆ విషయంలో తొలి నటుడిగా..!

Mar 25 2026 3:34 PM | Updated on Mar 25 2026 4:04 PM

Sanjay Dutt Create record 3 Movies gets Rs 1000 crore at Box office

రణ్‌వీర్ సింగ్ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ దురంధర్‌-2 బాక్సాఫీస్ రికార్డుల వేట కొనసాగుతోంది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా వెయ్యి కోట్ల మార్క్ చేరుకునేందుకు రెడీగా ఉంది. తొలి రోజు నుంచే వసూళ్లు సునామీ సృష్టిస్తోంది. గతేడాది రిలీజైన దురంధర్‌కు సీక్వెల్‌గా  ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల్లోనే పార్ట్‌-2 రిలీజ్ చేశారు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను తిరగరాసింది.

ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ గురించి చర్చ మొదలైంది. విలన్ పాత్రలతో అందరినీ దృష్టిస్తోన్న ఏకైక బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ విలన్‌గా మెప్పించిన మూడు సినిమాలు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మూడు సినిమాలు రూ. 1,000 కోట్ల వసూళ్లు సాధించిన ఏకైక బాలీవుడ్ స్టార్‌గా సంజయ్‌ దత్ ఘనతను సొంతం చేసుకున్నారు.

కన్నడ హీరో యశ్ నటించిన కేజీఎఫ్‌-2 చిత్రంలో విలన్ అధీర పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రం  బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దాదాపు 66 ఏళ్ల వయసులోనూ యువకుడిలా వరుస సినిమాలు చేస్తున్నారు. కేజీఎఎఫ్ తర్వాత షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా నటించిన 'జవాన్' చిత్రంలో సంజయ్‌ దత్ కీలక పాత్రలో కనిపించారు. ఈ యాక్షన్ డ్రామాగా చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1,160 కోట్ల మార్కును అధిగమించింది.

తాజాగా గతేడాది రిలీజైన దురంధర్‌ మూవీలోనూ సంజయ్ దత్‌ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా సైతం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ స్పై థ్రిల్లర్‌ చిత్రంలో విలన్ పాత్రలో మెప్పించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో సంజయ్ దత్‌ నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు వసూళ్లు రాబట్టాయి. ఇటీవల రిలీజైన దురంధర్‌-2 సైతం రూ.1000 కోట్ల మార్క్ దగ్గరలో ఉంది. ఈ చిత్రం కూడా వెయ్యి కోట్లు దాటితే సంజయ్‌ దత్‌కు రికార్డ్‌ మరింత పెరగనుంది. కాగా.. సంజయ్ దత్  'ధురందర్: ది రివెంజ్'లో ఎస్పీ చౌదరి అస్లాం పాత్ర పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటివరకు రూ. 919 కోట్లు వసూలు చేసింది. ఈ రికార్డ్స్ పరిశీలిస్తే.. ఇకపై సంజయ్‌ దత్ ఉంటే చాలు వెయ్యి కోట్లు పక్కా అనాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడి, డానిష్ పండోర్, సారా అర్జున్, గౌరవ్ గెరా  కీలక పాత్రలు పోషించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement