‘ఇరుముడి’ తర్వాత రవితేజ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదే | Ravi Teja, Vivek Athreya Movie Titles Revealed | Sakshi
Sakshi News home page

‘ఇరుముడి’ తర్వాత రవితేజ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదే

Oct 11 2026 11:16 AM | Updated on Oct 11 2026 11:20 AM

Ravi Teja, Vivek Athreya Movie Titles Revealed

‘ఇరుముడి’తో హిట్‌  ట్రాక్‌ఎక్కాడ రవితేజ. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రవితేజ కెరీర్‌కు ఓ కొత్త ఊపునిచ్చింది. ఇప్పుడు అదే జోష్‌తో కొత్త సినిమాను ప్రారంభించాడు. ఈ చిత్రానికి వివేక్‌ ఆత్రేయ దర్‌శకత్వం వహిస్తున్నాడు. ఈ రోజు (అక్టోబర్‌ 11) ఈ చిత్రం పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సినిమా టైటిల్‌ని రివీల్‌ చేశారు మేకర్స్‌. ఈ చిత్రానికి ‘తులాభారం’అనే టైటిల్‌ని ఖరారు చేశారు. 

ఓ ప్రత్యేక వీడియో ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ఇరుముడి టైటిల్‌ మాదిరే తులాభారం కూడా కాస్త డిఫరెంట్‌గా ఉంది. రవితేజకు ఉన్న మాస్‌ ఇమేజ్‌కి ఈ టైటిల్‌కి సంబంధం లేదు. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో పొలిటికల్‌ టచ్‌ కూడా ఉంటుందట. అలాగే క్రైమ్‌ కామెడీతో పాటు లవ్‌స్టోరీ కూడా ఉండబోతుందట. అన్నింటిని బ్యాలెన్స్‌  చేయడానికే ‘తులాభారం’ అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేసినట్లు వీడియో ద్వారా చెప్పారు.

ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియాంక మోహన్, అనస్వర రాజన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు జె.డి. చక్రవర్తి విలన్ పాత్రలో కనిపిస్తుండగా డైరెక్టర్ కమ్ నటుడు తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో మెరవనున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement