‘ఇరుముడి’ తర్వాత రవితేజ సినిమా ఇదే! | Raviteja next movie with vivek athreya RT78 | Sakshi
Sakshi News home page

‘ఇరుముడి’ తర్వాత రవితేజ సినిమా ఇదే!

Oct 9 2026 6:51 PM | Updated on Oct 9 2026 6:51 PM

Raviteja next movie with vivek athreya RT78

మాస్‌ మహారాజా రవితేజ అభిమానులకు మరో ఆసక్తికరమైన అప్‌డేట్‌ వచ్చేసింది. తన తదుపరి సినిమాపై వస్తున్న వార్తలకు చిత్రబృందం అధికారిక ప్రకటనతో తెరదించింది. యువ దర్శకుడు వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రవితేజ తన 78వ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను నిర్మాణ సంస్థ బ్రిడ్స్‌ ప్రొడక్షన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది.

రవితేజ – వివేక్‌ ఆత్రేయ కాంబోలో
రవితేజ కెరీర్‌లో 78వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌కు (RT78) వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించనున్నారు. లక్ష్మణ్‌, శ్రీనిరావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కొంతకాలంగా ఈ కాంబినేషన్‌పై ప్రచారం జరుగుతుండగా.. తాజాగా నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటనతో ఈ వార్తలకు బలం చేకూరింది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను అక్టోబరు 11న ప్రకటించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

కథానాయిక ఎవరు?
ఈ చిత్రంలో రవితేజ సరసన నటించబోయే కథానాయిక ఎవరు? ఇతర కీలక పాత్రల్లో ఎవరెవరు కనిపించనున్నారు? అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. టైటిల్‌ ప్రకటనతో పాటు సినిమా గురించి మరిన్ని వివరాలు వెల్లడవుతాయా? అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. దర్శకుడు వివేక్‌ ఆత్రేయ తనదైన కథాకథనంతో ఈ చిత్రాన్ని ఎలా తెరకెక్కించనున్నారో చూడాలి.

(ఇదీ చదవండి: రాజ్యసభకు రజినీకాంత్‌ భార్య?)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement