బిగ్‌బాస్‌ 8: ఫస్ట్‌ ఫైనలిస్ట్‌ ఎవరంటే? | Bigg Boss Telugu 8: Mukku Avinash Gets the Ticket To Finale | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: టికెట్‌ టు ఫినాలే అతడికి అప్పజెప్పిన శ్రీముఖి.. కిచెన్‌లో మళ్లీ లొల్లి

Nov 29 2024 4:09 PM | Updated on Nov 29 2024 4:25 PM

Bigg Boss Telugu 8: Mukku Avinash Gets the Ticket To Finale

బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌ ముగింపుకు వచ్చేసింది. డైరెక్ట్‌గా ఫినాలేలో అడుగుపెట్టేందుకు ఎప్పటిలాగే బిగ్‌బాస్‌ టికెట్‌ టు ఫినాలే టాస్క్‌ ప్రవేశపెట్టాడు. ఇప్పటికే ఈ టాస్క్‌లో అవినాష్‌, రోహిణి, నిఖిల్‌ కంటెండర్లుగా నిలిచారు. నేడు హౌస్‌లోకి వచ్చిన యాంకర్‌ శ్రీముఖి వారిలో ఒకర్ని ఫైనలిస్టుగా ప్రకటించనుంది.

కిచెన్‌లో మళ్లీ కయ్యం
ఈ మేరకు ఓ ప్రోమో కూడా రిలీజైంది. అయితే ఎప్పటిలాగే మరోసారి కిచెన్‌లో కయ్యం మొదలైంది. ఒక్కొక్కరికి రెండు దోశలు వేస్తోంది ప్రేరణ. తనకు ఒక చీజ్‌ దోశ కావాలని రోహిణి అడిగితే అందుకు ప్రేరణ ఒప్పుకోలేదు. చీజ్‌ దోశ తిన్నవాళ్లు ప్లేన్‌ దోశ తినలేరంటూ అడ్డు చెప్పింది. దానికి తేజ అభ్యంతరం చెప్పాడు. ఇలా మధ్యలో దూరడం తప్పని ప్రేరణ అనగా.. అందరికీ సమానంగా పెట్టమని చెప్పానంతేనని తేజ బదులిచ్చాడు.

టికెట్‌ టు ఫినాలే ఎవరి సొంతం?
తర్వాత శ్రీముఖి హౌస్‌లో అడుగుపెట్టింది. ఇకపోతే అవినాష్‌ టికెట్‌ టు ఫినాలే గెలిచినట్లు ఓ వార్త వైరలవుతోంది. అదే నిజమైతే ఈ సీజన్‌లో ఫినాలేలో అడుగుపెట్టిన మొదటి కంటెస్టెంట్‌ అవినాష్‌ అవుతాడు. అయితే ఈ వారం గండం గట్టెక్కితేనే అది సాధ్యమవుతుంది. అసలే ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ జరిగే ఛాన్స్‌ ఉంది. పైగా అవినాష్‌ నామినేషన్స్‌లో ఉన్నాడు. ఈ ఒక్కవారం సేవ్‌ అయ్యాడంటే టాప్‌ 5లో బెర్త్‌ కన్ఫామ్‌ అయినట్లే!

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement