గర్వం నెత్తికెక్కిందన్న ప్రేరణ.. అణచివేసిన ఓజీ టీమ్‌! | Bigg Boss Telugu 8: Virus Task for OG and Royal Clans | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: ఇది మన సీజన్‌.. మన టీమ్‌లో ఒకరే టైటిల్‌ గెలవాలన్న నిఖిల్‌

Oct 24 2024 6:51 PM | Updated on Oct 24 2024 7:02 PM

Bigg Boss Telugu 8: Virus Task for OG and Royal Clans

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఫన్‌ టాస్కులు ఎక్కువైపోయాయి. అందుకే బీబీ రాజ్యం అంటూ ఓ ఆసక్తికర ఛాలెంజ్‌ విసిరాడు. రెండు టీముల్లో ఏది ముందుగా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటోందో చూద్దామన్నాడు. ఈ క్రమంలోనే వరుస టాస్కులిస్తున్నాడు. నిన్నటి వాటర్‌ టాస్కులో రాయల్‌ టీమ్‌ గెలిచింది. నిజానికి వైల్డ్‌ కార్డ్స్‌ వచ్చినప్పటినుంచి తెగ దూకుడుగా ఆడుతూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు.

ఆ పొగరు తగ్గాలి
దీనివల్ల వారికి గర్వం నెత్తికెక్కిందంటోంది ప్రేరణ. అన్నీ మేమే గెలిచాం అంటున్నారు. ఆ పొగరు కొంత తగ్గాలి అని నబీల్‌తో అంది. అటు నిఖిల్‌ సైతం తన ఓజీ టీమ్‌తో.. ఇది మన సీజన్‌. ట్రోఫీ ఎవరైనా ఎత్తాలంటే మన టీమ్‌లోనే ఒకరై ఉండాలి అని సభ్యుల్లో ధైర్యం నింపాడు. తర్వాత రెండు క్లాన్స్‌కు గేమ్స్‌ పెట్టాడు.

గర్వం అణిచేసిన ఓజీ టీమ్‌
ఇందులో ఓజీ టీమ్‌ గెలిచినట్లు తెలుస్తోంది. అంతేకాదు బీబీ రాజ్యంలో ఇచ్చే టాస్కుల్లో ఎక్కువ టాస్కులు ఓజీ టీమ్‌ గెలిచి రాయల్స్‌ గర్వాన్ని అణగదొక్కిందని సమాచారం.! మరి ఏయే టీమ్‌ ఏయే టాస్కు గెలిచిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేంతవరకు ఆగాల్సిందే!

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement