భార్య విలవిలలాడుతుంటే వీడియో తీసి..

Husband Throw his Wife in a Well for Dowry - Sakshi

మధ్యప్రదేశ్‌లోని నీమచ్‌లో ఒక గృహిణి హింసకు గురైన ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కట్నం కోసం ఒక భర్త తన భార్యకు తాడుకట్టి బావిలోకి వదిలాడు. తరువాత ఆమె బావిలో నుంచి కాపాడమంటూ ఆర్తనాదాలు చేస్తుండగా వీడియో తీసి, దానిని భార్య పుట్టింటివారికి పంపాడు. 

ఈ ఉదంతం జాదవ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కిర్‌ఖెడా గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాకేష్‌ కీర్‌కు మూడేళ్ల క్రితం రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లా నివాసి ఉషతో వివాహం జరిగింది. పెళ్లయినప్పటి నుంచి రాకేష్‌ తన భార్యను కట్నం కోసం వేధిస్తున్నాడు.ఈ మధ్య కాలంలో రాకేష్ భార్య విషయంలో మరింత క్రూరంగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా తన భార్య ఉషకు తాడు కట్టి బావిలోకి వేలాడదీశాడు. నీటితో నిండిన బావిలో మునిగిన ఆమె భయంతో తనను బయటకు తీసుకురావాలంటూ భర్తను వేడుకుంది. అయితే భర్త ఆమె ఆవేదనను పట్టించుకోకుండా, ఈ దృశ్యాన్ని వీడియో తీశాడు. 

కొద్దిసేపటి తరువాత చుట్టుపక్కలవారు జోక్యం చేసుకుని ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఉదంతం పోలీసుల వరకూ చేరడంతో వారు నిందితుడు రాకేష్‌ను అరెస్టు చేశారు. జాదవ్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారి అస్లం పఠాన్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఉదంతంలో నిందితుడు రాకేష్‌పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశామన్నారు. అలాగే రాకేష్‌ను అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టామని, అనంతరం జైలుకు తరలించామన్నారు.
ఇది కూడా చదవండి: అది ‘ఇత్తడి నగరం’ ఎందుకయ్యింది? నిత్యం శబ్ధాలు ఎందుకు వినిపిస్తాయి?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top