ENG VS IND 5th Test: మళ్లీ టాస్‌ ఓడిన భారత్‌.. జట్టులో ఎవరూ ఊహించని ఆటగాడు | ENG VS IND 5th Test: England Won The Toss And Choose To Bowl, Here Are Playing XI | Sakshi
Sakshi News home page

ENG VS IND 5th Test: మరోసారి టాస్‌ ఓడిన భారత్‌.. తుది జట్టులో ఎవరూ ఊహించని ఆటగాడు

Jul 31 2025 3:19 PM | Updated on Jul 31 2025 3:45 PM

ENG VS IND 5th Test: England Won The Toss And Choose To Bowl, Here Are Playing XI

ఇంగ్లండ్‌ గడ్డపై భారత్‌ వరుసగా ఐదో మ్యాచ్‌లో టాస్‌ ఓడింది. లండన్‌లోని కెన్నింగ్టన్‌ ఓవల్‌ మైదనంలో ఇవాళ (జులై 31) ఐదో టెస్ట్‌ ప్రారంభం కానుండగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ ఓడి ఇంగ్లండ్‌ తాత్కాలిక సారధి ఓలీ పోప్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేయనుంది. 

ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ ఏకంగా నాలుగు మార్పులు చేసింది. రిషబ్‌ పంత్‌, శార్దూల్‌ ఠాకూర్‌, బుమ్రా, అన్షుల్‌ కంబోజ్‌ స్థానాల్లో ధ్రువ్‌ జురెల్‌, కరుణ్‌ నాయర్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, ఆకాశ్‌దీప్‌ తుది జట్టులోకి వచ్చారు.

ఈ మ్యాచ్‌లో కరుణ్‌ నాయర్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఓ మోస్తరుగా రాణించిన శార్దూల్‌ ఠాకూర్‌ను పక్కకు పెట్టి మరీ కరుణ్‌కు అవకాశం ఇచ్చారు. బహుశా కరుణ్‌కు ఇదే లాస్ట్‌ ఛాన్స్‌ కావచ్చు. ఈ మ్యాచ్‌లో విఫలమైతే కరుణ్‌ కెరీర్‌ సమాప్తమైనట్లే.

మరోవైపు ఇంగ్లండ్‌ సైతం ఈ మ్యాచ్‌ కోసం​ నాలుగు మార్పులు చేసింది. బెన్‌ స్టోక్స్, ‌జోఫ్రా ఆర్చర్‌, బ్రైడన్‌ కార్స్‌, లియామ్‌ డాసన్‌ స్థానాల్లో జేకబ్‌ బేతెల్‌, గస్‌ అట్కిన్సన్‌, జోష్‌ టంగ్‌, జేమీ ఓవర్టన్‌ తుది జట్టులోకి వచ్చారు. వర్షం కారణంగా టాస్‌ కాస్త ఆలస్యమైంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ 1-2తో వెనుకపడి ఉంది.

తుది జట్లు..
భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్‌), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్‌), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్(కెప్టెన్‌), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్(వికెట్‌కీపర్‌), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement