
త్వరలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగబోయే చారిత్రక టీ20 సిరీస్‌కు ముందు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఈ సిరీస్ కోసం ప్రకటించిన 14 మంది సభ్యుల జట్టులో కెనడా కుర్రాడికి చోటు కల్పించింది.
23 ఏళ్ల బెన్ కాలిట్జ్ అండర్-19 స్థాయి వరకు కెనడాకు ప్రాతినిథ్యం వహించాడు. ఇటీవలే ఐర్లాండ్‌కు వలస వచ్చాడు. ఐర్లాండ్ పౌరసత్వం పొందడం ద్వారా కాలిట్జ్ జాతీయ జట్టు ఎంపికకు అర్హత సాధించాడు.
ఎడమ చేతి వాటం బ్యాటర్, రైట్ ఆర్మ్ స్లో బౌలర్ అయిన కాలిట్జ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ అవకాశం. కాలిట్జ్‌కు 17 టీ20లు, 11 లిస్ట్-A మ్యాచ్‌లు, ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన అనుభవం ఉంది.
గతంలో ఐర్లాండ్ తరఫున చాలామంది విదేశీ ఆటగాళ్లు ఆడినప్పటికీ.. ఇంగ్లండ్‌తో హోం టీ20 సిరీస్‌లో కాలిట్జ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాడు.
ఈ సిరీస్‌కు పాల్ స్టిర్లింగ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. హ్యారీ టెక్టర్, కర్టిస్ క్యాంఫర్, జార్డన్ నీల్, లార్కన్ టక్కర్ వంటి కీలక ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకున్నారు.
అయితే గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఫాస్ట్ బౌలర్ జోష్ లిటిల్ మాత్రం ఈ సిరీస్‌కు ఎంపిక కాలేదు. ఈ సిరీస్ ఐర్లాండ్‌కు ఇంగ్లండ్‌తో తొలి హోమ్ టీ20 సిరీస్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లన్నీ డబ్లిన్‌లోని ది విలేజ్ వేదికగా జరుగనున్నాయి.
షెడ్యూల్:
తొలి టీ20: సెప్టెంబర్ 17
రెండో టీ20: సెప్టెంబర్ 19
మూడో టీ20: సెప్టెంబర్ 21
ఐర్లాండ్ జట్టు: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), రాస్ అడైర్, బెన్ కాలిట్జ్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, గ్రాహం హ్యూమ్, మాథ్యూ హంఫ్రీస్, బ్యారీ మెక్‌కార్తీ, జోర్డాన్ నీల్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.