
2025-26 యాషెస్ సిరీస్ (Ashes 2025-26) కోసం ఇంగ్లండ్ జట్టును (England Cricket Team) ఇవాళ (సెప్టెంబర్ 23) ప్రకటించారు. భుజం గాయంతో కోలుకుంటున్న బెన్ స్టోక్స్‌నే (Ben Stokes) ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా కొనసాగించారు. ఓలీ పోప్ స్థానంలో హ్యారీ బ్రూక్ (Harry Brook) వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
మ్యాథ్యూ పాట్స్, విల్ జాక్స్ జట్టులో చోటు దక్కించుకున్నారు. మార్క్ వుడ్, షోయబ్ బషీర్ గాయాల నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చారు. జేమీ స్మిత్ వికెట్ కీపర్‌గా బాధ్యతలు చేపడతాడు. క్రాలే, డకెట్, పోప్, రూట్, జేకబ్ బేతెల్ టాపార్డర్‌లో ఉంటారు.
భారత్‌తో ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్‌లో మధ్యలో ఎంట్రీ ఇచ్చిన జోఫ్రా ఆర్చర్ పేస్ అటాక్‌కు లీడ్ చేస్తాడు. బ్రైడన్ కార్స్, గస్ అట్కిన్సన్, టంగ్ జట్టులో చోటు నిలుపుకున్నారు. బషీర్‌కు జతగా రూట్, జేకబ్ బేతెల్, జాక్స్ స్పిన్ భారాన్ని మోస్తారు.
ఓవల్ టెస్ట్‌లో గాయానికి గురైన క్రిస్ వోక్స్ యాషెస్‌కు ఎంపిక కాలేదు. ఆ మ్యాచ్‌లో భుజం విరిగినా, వోక్స్ బ్యాటింగ్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం అతను శస్త్రచికిత్సను నివారిస్తూ రీహ్యాబ్‌పై దృష్టి పెట్టాడు.
ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్ (Australia Vs England) నవంబర్ 21 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు (5 టెస్ట్ మ్యాచ్‌లు) జరుగుతుంది. ఈ సారి ఈ సిరీస్ ఆస్ట్రేలియాలో జరుగనుంది.
ఇంగ్లండ్ యాషెస్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్ (వైస్-కెప్టెన్), బ్రైడాన్ కార్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, విల్ జాక్స్, ఓలీ పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్, మార్క్ వుడ్
యాషెస్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు కూడా ఇదే సందర్భంగా జట్లను ప్రకటించారు. టీ20, వన్డే జట్లకు హ్యారీ బ్రూక్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. జాక్ క్రాలీ తొలిసారి టీ20 జట్టుకు ఎంపిక కాగా.. ఆర్చర్, డకెట్, స్మిత్ విశ్రాంతి పొందనున్నారు.
3 టీ20లు, 3 వన్డేల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టు అక్టోబర్ 18 నుంచి నవంబర్ 1 వరకు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది.
ఇంగ్లండ్ వన్డే జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సోనీ బేకర్, టామ్ బాంటన్, జేకబ్ బేతెల్, జోస్ బట్లర్, బ్రైడాన్ కార్స్, సామ్ కర్రన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, జో రూట్, జేమీ స్మిత్, లూక్ వుడ్
ఇంగ్లండ్ టీ20 జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, సోనీ బేకర్, టామ్ బాంటన్, జేకబ్ బేతెల్, జోస్ బట్లర్, బ్రైడాన్ కార్స్, జోర్డాన్ కాక్స్, జాక్ క్రాలే, సామ్ కర్రన్, లియామ్ డాసన్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, లూక్ వుడ్
చదవండి: ఏ జట్టైనా టీమిండియాను ఓడించగలదు.. బంగ్లాదేశ్ కోచ్ అహంకారపూరిత వ్యాఖ్యలు