2025 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాల కోసం సిఫారసుల జాబితాను కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ఇవాళ (డిసెంబర్ 24) ప్రకటించింది. ఈ జాబితాలో ఆసక్తికరంగా ఒక్క క్రికెటర్‌కు కూడా చోటు దక్కలేదు.
భారత హాకీ జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ సింగ్ ఒక్కడే మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు కోసం సిఫారసు చేయబడ్డాడు. మరో 24 మంది క్రీడాకారుల పేర్లు అర్జున అవార్డుల కోసం సిఫారసు చేయబడ్డాయి.
మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు: హార్దిక్ సింగ్ (హాకీ)
అర్జున అవార్డు:
- అథ్లెటిక్స్: తేజస్విన్ శంకర్, ప్రియాంక, మహ్మద్ అఫ్సల్, ఏక్తా భ్యాన్ (పారా)
- చెస్: దివ్య దేశ్‌ముఖ్, విదిత్ గుజరాతి
- బ్యాడ్మింటన్: త్రీసా జోలీ, గాయత్రి గోపిచంద్
- షూటింగ్: మెహులీ ఘోష్, అఖిల్ శెరాన్, ధనుష్ శ్రీకాంత్ (డెఫ్), రుద్రాంశ్ ఖండేల్వాల్ (పారా)
- హాకీ: రాజ్‌కుమార్ పాల్, లాల్‌రెంసియామి
- జిమ్నాస్టిక్స్: ప్రణతి నాయక్
- కబడ్డీ: సుర్జీత్, పూజా
- ఇతర విభాగాలు: నరేందర్ (బాక్సింగ్), నిర్మల భాటి (ఖోఖో), పద్మనాభ్ సింగ్ (పోలో), అర్వింద్ సింగ్ (రోయింగ్), సుతిర్థా ముఖర్జీ (టేబుల్ టెన్నిస్), సోనం మాలిక్ (రెజ్లింగ్), ఆర్తి పాల్ (యోగా, ఈ విభాగంలో తొలి సిఫారసు)


