
ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌లో టీమిండియా చెత్త ఆటతీరును ప్రదర్శించింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 224 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ (21.4-8-33-5) ధాటికి భారత ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. అట్కిన్సన్‌కు జోష్ టంగ్ (16-4-57-3), క్రిస్ వోక్స్ (14-1-46-1) సహకరించారు.
204/6 వద్ద రెండు రోజు ఆట ప్రారంభించిన భారత్.. సెషన్ ప్రారంభమైన గంటలోపే ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్లు కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్ పెద్దగా పరుగులేమీ జోడించకుండానే పెవిలియన్‌కు చేరారు. ఆతర్వాత వచ్చిన సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయారు.
ఇవాల్టి ఆటలో అట్కిన్సన్ వీర లెవెల్లో విజృంభించాడు. చివరి నాలుగు వికెట్లలో మూడు వికెట్లు (సుందర్, సిరాజ్, ప్రసిద్ద్) అతనే తీశాడు. చాలాకాలం తర్వాత అర్దసెంచరీతో రాణించిన కరుణ్‌ను టంగ్ బోల్తా కొట్టించాడు.
భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుభ్‌మన్ గిల్ 21, కరుణ్ నాయర్ 57, రవీంద్ర జడేజా 9, ధ్రువ్ జురెల్ 19, వాషింగ్టన్ సుందర్ 26, సిరాజ్, ప్రసిద్ద్ డకౌట్ అయ్యారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడిన విషయం తెలిసిందే.