
న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో (New Zealand vs England) మరో మ్యాచ్ వర్షార్పణమైంది. ఆక్లాండ్ వేదికగా ఇవాళ (అక్టోబర్ 23) జరగాల్సిన మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అంతకుముందు క్రైస్ట్‌చర్చ్‌లో జరగాల్సిన తొలి టీ20 కూడా వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది.
మధ్యలో రెండో టీ20లో 65 పరుగుల తేడాతో గెలవడంతో సిరీస్ ఇంగ్లండ్ (England) వశమైంది (1-0). ఆ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన హ్యారీ బ్రూక్‌కు (Harry Brookk) (35 బంతుల్లో 78; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.
అక్టోబర్ 26 (మౌంట్ మాంగనూయ్), 29 (హ్యామిల్టన్), నవంబర్ 1 (వెల్లింగ్టన్) తేదీల్లో ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
3.4 ఓవర్ల పాటు సాగిన ఆట
మూడో టీ20 3.4 ఓవర్ల పాటు సాగింది. టాస్ ఓడి ఇంగ్లండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ వర్షం ప్రారంభమయ్యే సమయానికి వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. టిమ్ రాబిన్సన్ (2) ఔట్ కాగా.. టిమ్ సీఫర్ట్ (23), రచిన్ రవీంద్ర (10) క్రీజ్‌లో ఉన్నారు.
వన్డే సిరీస్‌కు ఇరు జట్లు..
ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జో రూట్, బెన్ డకెట్, జేకబ్ బేతెల్, సామ్ కర్రన్, జేమీ ఓవర్టన్, రెహాన్ అహ్మద్, లియామ్ డాసన్, టామ్ బాంటన్, జేమీ స్మిత్, జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, సోన్నీ బేకర్, బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్, లూక్ వుడ్
న్యూజిలాండ్: మార్క్ చాప్‌మన్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్, మైఖేల్ బ్రేస్‌వెల్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), జకరీ ఫౌల్క్స్, నాథన్ స్మిత్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, కైల్ జేమీసన్, జేకబ్ డఫీ, మ్యాట్ హెన్రీ
చదవండి: Virat Kohli: చెరగని మరక.. 17 ఏళ్ల కెరీర్‌లో తొలిసారి..!