హ్యారీ బ్రూక్‌ ఐకానిక్‌ శతకం వృధా | Brook Century Goes In Vain, New Zealand Beat England By 4 Wickets In 1st ODI | Sakshi
Sakshi News home page

హ్యారీ బ్రూక్‌ ఐకానిక్‌ శతకం వృధా

Oct 26 2025 2:44 PM | Updated on Oct 26 2025 3:20 PM

Brook Century Goes In Vain, New Zealand Beat England By 4 Wickets In 1st ODI

న్యూజిలాండ్‌ పర్యటనలో ఇంగ్లండ్‌ తొలి ఓటమి ఎదుర్కొంది. తొలుత జరిగిన టీ20 సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకున్న ఇంగ్లీష్‌ జట్టు.. మౌంట్‌ మాంగనూయ్‌ వేదికగా ఇవాళ (అక్టోబర్‌ 26) జరిగిన తొలి వన్డేలో (New Zealand vs England) 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (Harry Brook) ఐకానిక్‌ శతకం (101 బంతుల్లో 135; 9 ఫోర్లు, 11 సిక్సరు​) కారణంగా గౌరవప్రదమైన స్కోర్‌ (35.2 ఓవర్లలో 223 ఆలౌట్‌) చేయగా.. న్యూజిలాండ్‌ 36.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్‌ 1-0 ఆధిక్యంలో వెళ్లింది. రెండో వన్డే హ్యామిల్టన్‌ వేదికగా అక్టోబర్‌ 29న జరుగనుంది.

బ్రూక్‌ ఐకానిక్‌ శతకం
ఈ మ్యాచ్‌లో బ్రూక్‌ చేసిన శతకం వన్డే క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత క్రేజీయెస్ట్‌ శతకంగా చెప్పవచ్చు. బ్రూక్‌ తన జట్టును 56 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశ నుంచి గౌరవప్రదమైన స్కోర్‌ వరకు చేర్చి పదో వికెట్‌గా వెనుదిరిగాడు.

ఇంగ్లండ్‌ 166 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌ కోల్పోగా ఆ సమయానికి బ్రూక్‌ స్కోర్‌ 86 పరుగులుగా ఉండింది. ఈ దశలో బ్రూక్‌ వరుసగా మూడు సిక్సర్లు కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బ్రూక్‌ ఒంటిచేత్తో ఇన్నింగ్స్‌ మొత్తాన్ని నడిపాడు. జేమీ ఓవర్టన్‌ (46) అతనికి కాస్త సహకించాడు. మిగతా ఇంగ్లండ్‌ బ్యాటర్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.

గెలిపించిన మిచెల్‌
స్వల్ప లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ కూడా తడబడింది. 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆ జట్టును డారిల్‌ మిచెల్‌ (78 నాటౌట్‌), మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ (51) ఆదుకున్నారు. ముఖ్యంగా మిచెల్‌ చివరి వరకు క్రీజ్‌లో నిలబడి న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. మిచెల్‌కు బ్రేస్‌వెల్‌తో పాటు టామ్‌ లాథమ్‌ (24), మిచెల్‌ సాంట్నర్‌ (27) సహకరించారు. 

చదవండి: జీరో నుంచి హీరో.. యువ క్రికెటర్లకు రోల్‌ మోడల్‌! ఈ వీరుడి గురుంచి తెలుసా?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement