
స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు 14 మంది సభ్యులతో కూడిన జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ తిరిగొచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత విలియమ్సన్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు.
ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో సెలక్టర్లు అతడికి అవకాశమిచ్చారు. అతడితో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నాథన్ స్మిత్ కూడా పునరాగమనం చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ జట్టు కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్ వ్యవహరించాడు. అదేవిధంగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్ గాయం కారణంగా దూరమయ్యాడు.
లాథమ్‌తో పాటు మొహమ్మద్ అబ్బాస్ ఫిన్ అల్లెన్, లాకీ ఫెర్గూసన్, ఆడమ్ మిల్నే, విల్ ఓ'రూర్కే , గ్లెన్ ఫిలిప్స్, బెన్ సియర్స్ గాయాల కారణంగా ఈ సిరీస్‌కు అందుబాటులో లేరు. టీ20ల్లో సత్తాచాటుతున్న జాక్ ఫాల్క్స్‌కు కివీస్ సెలక్టర్లు వన్డేలకు పిలుపునిచ్చారు.
ప్రస్తుతం కివీస్ జట్టు ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతోంది. తొలి టీ20 వర్షర్పాణం కాగా.. రెండో టీ20 సోమవారం జరగనుంది. అక్టోబర్ 26 నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.
ఇంగ్లండ్‌తో వన్డేలకు న్యూజిలాండ్ జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, రాచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్
చదవండి: CWC 2025: ఇంగ్లండ్ చేతిలో ఓటమి.. అయినా భారత్‌కు సెమీస్ ఛాన్స్! ఇలా జరగాల్సిందే?