
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ సామ్ కుక్ హండ్రెడ్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్ (సెట్) వేశాడు. ఈ లీగ్‌లో ట్రెంట్ రాకెట్స్‌కు ఆడుతున్న కుక్.. ఇవాళ (ఆగస్ట్ 22) ఓవల్ ఇన్విన్సిబుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 బంతుల్లో ఏకంగా 32 పరుగులు సమర్పించుకున్నాడు.
66వ బంతికి 12 పరుగులిచ్చిన (5 వైడ్లు, మరో వైడ్, సిక్సర్) కుక్.. 67 బంతికి బౌండరీ.. 68 బంతికి రికార్డు స్థాయిలో 14 పరుగులు (సిక్సర్ ప్లస్ నో బాల్ (హండ్రెడ్ లీగ్‌లో నో బాల్‌కు 2 పరుగులు), సిక్సర్), 69వ బంతికి 2 పరుగులిచ్చాడు. 70వ బంతికి పరుగులేమీ ఇవ్వలేదు.
దీంతో కుక్ సెట్‌లో (ఓవర్) మొత్తం 32 పరుగులు వచ్చాయి. హండ్రెడ్ లీగ్‌లో 5 బంతులను ఓ సెట్‌గా పరిగణిస్తారు. ఈ లీగ్ చరిత్రలో ఇదే అత్యంత ఖరీదైన సెట్‌గా రికార్డుల్లోకెక్కింది.
కుక్ చెత్త ప్రదర్శన కారణంగా అతని జట్టు ట్రెంట్ రాకెట్స్ గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడింది. కుక్ బంతిని అందుకోకముందు ప్రత్యర్థి ఇన్విన్సిబుల్స్ 35 బంతుల్లో 83 పరుగులు చేయాల్సి ఉండింది. ఈ సెట్‌లో కుక్ స్వయంకృతాపరాథాలతో పాటు సామ్ కర్రన్ బ్యాట్ ఝులిపించడంతో సమీకరణలు ఒక్కసారిగా 30 బంతుల్లో 51 పరుగులకు మారాయి.
సామ్ కర్రన్‌తో పాటు (24 బంతుల్లో 54; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) జోర్డన్ కాక్స్ (32 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హుద్దగా చెలరేగి ఇన్విన్సిబుల్స్‌కు అద్భుత విజయాన్ని అందించారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాకెట్స్.. జో రూట్ (41 బంతుల్లో 76; 11 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం 172 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఇన్విన్సిబుల్స్.. ఆదిలో నిదానంగా ఆడినా, ఆతర్వాత గేర్ మార్చి ఊహించని విజయం సాధించింది. కర్రన్, కాక్స్ విధ్వంసం ధాటికి ఆ జట్టు 89 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది.