టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరపున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానానికి కోహ్లి చేరుకున్నాడు. వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లి ఈ ఫీట్ నమోదు చేశాడు.
కోహ్లికి ఇది 309వ వన్డే మ్యాచ్. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిట ఉండేది. గంగూలీ తన కెరీర్‌లో 308 మ్యాచ్‌లు ఆడి 11221 పరుగులు చేశాడు. ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(463) అగ్రస్ధానంలో ఉన్నారు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలోనూ సచిన్(18426) టాప్‌లో కొనసాగుతున్నారు.
భారత్ తరపున అత్యధిక వన్డేలు ఆడిన ప్లేయర్లు వీరే..
సచిన్ టెండూల్కర్-463
ఎంఎస్ ధోని-347
రాహుల్ ద్రవిడ్-340
అజారుద్దీన్-334
విరాట్ కోహ్లి-309
సౌరవ్ గంగూలీ-308
వన్డే కింగ్..
ఇక ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లి కూడా తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా కోహ్లి కొనసాగుతున్నాడు. కోహ్లి ఇప్పటివరకు 53 సెంచరీలు నమోదు చేశాడు. అదేవిధంగా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లి(14557) రెండో స్ధానంలో ఉన్నాడు. కోహ్లి దారిదాపుల్లో ఎవరూ లేరు.


