
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ ఇటీవల చనిపోయిన తన తండ్రి జాన్ బట్లర్‌కు ఓ అపూర్వ కానుక ఇచ్చాడు. హండ్రెడ్ లీగ్‌లో చేసిన రికార్డు హాఫ్ సెంచరీని తండ్రికి అంకితమిచ్చాడు. తండ్రి మరణం తీవ్రంగా కలచి వేస్తున్నప్పటికీ హండ్రెడ్ లీగ్‌లో ఆడుతున్న జోస్ (మాంచెస్టర్ ఒరిజినల్స్).. తాజాగా వెల్ష్ ఫైర్‌పై మెరుపు అర్ద సెంచరీ చేశాడు.
ఈ ఫీట్ సాధించిన అనంతరం జోస్ తండ్రిని స్మరించుకుంటూ.. "నాన్నా, ఇది నీ కోసమే" అన్నట్లు బ్యాట్‌ను ఆకాశానికెత్తి చూపాడు. ఈ సీన్లు క్రికెట్ అభిమానులను కదలించాయి. బట్లర్ తన తండ్రిని ఎంత మిస్ అవుతాన్నాడో వ్యక్తపరిచాయి.
కొద్ది రోజుల కిందటే జోస్ తన తండ్రి మరణ వార్తను సోషల్‌మీడియా వేదికగా షేర్ చేశాడు. రెస్ట్ ఇన్ పీస్ డాడ్, మాకు ప్రతిదీ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ తండ్రితో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు.
అనంతరం ఆగస్టు 9న ఓవల్ ఇన్విన్సిబుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్ సభ్యులంతా నల్లటి ఆర్మ్ బ్యాండ్‌లు ధరించి జోస్ తండ్రి మృతికి నివాళులు అర్పించారు. అయితే ఆ మ్యాచ్‌లో జోస్ నాలుగు బంతులాడి డకౌట్‌గా వెనుదిరిగాడు.
రికార్డు హాఫ్ సెంచరీ
తాజాగా వెల్ష్ ఫైర్‌పై జోస్ చేసిన హాఫ్ సెంచరీ (34 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రికార్డుపుటల్లోకెక్కింది. ఈ హాఫ్ సెంచరీ జోస్‌కు టీ20ల్లో 94వది. దీంతో జోస్ పొట్టి క్రికెట్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్‌ను వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకాడు.
వెల్ష్ ఫైర్‌తో మ్యాచ్‌లో జోస్ హాఫ్ సెంచరీతో మెరిసిరా తన జట్టును గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో ఒరిజినల్స్ 25 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. జోస్ రికార్డు హాఫ్ సెంచరీ వృధా అయిపోయింది.
టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన టాప్-5 ఆటగాళ్లు..
డేవిడ్ వార్నర్: 113 అర్ద సెంచరీలు (418 ఇన్నింగ్స్)
విరాట్ కోహ్లీ: 105 అర్ధ సెంచరీలు (397 ఇన్నింగ్స్)
జోస్ బట్లర్: 94 అర్ధ సెంచరీలు (436 ఇన్నింగ్స్)
బాబర్ అజామ్: 93 అర్ధ సెంచరీలు (309 ఇన్నింగ్స్)
క్రిస్ గేల్: 88 అర్ధ సెంచరీలు (455 ఇన్నింగ్స్)