
టీమిండియా చివరి టెస్ట్లో విజయం సాధించడంపై దర్శకధీరుడు రాజమౌళి హర్షం వ్యక్తం చేశారు. వాట్ ఏ స్పెల్ సిరాజ్ మియా అంటూ మహమ్మద్ సిరాజ్పై ప్రశంసలు కురిపించారు. అలాగే ప్రసిధ్ కృష్ణను సైతం కొనియాడారు. ఓవల్లో టీమిండియా తిరిగి పుంజుకుని అద్భుతంగా పోరాడిందని ప్రశంసలు కురిపించారు. టెస్ట్ క్రికెట్కు మరేది సాటిరాదని మరోసారి నిరూపించారని ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాజమౌళి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కాగా.. ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా సంచలన విజయం సాధించింది. చివరి రోజు వరకు సాగిన ఈ మ్యాచ్లో ఆరు పరుగుల తేడాతో మనోళ్లు విజయకేతనం ఎగరేశారు. సిరాజ్ అద్భుతమైన బౌలింగ్లో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ఐదు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రసిధ్ కృష్ణ సైతం నాలుగు వికెట్లు తీసి ఇంగ్లాండ్ను కోలుకోలేని దెబ్బతీశాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది.
ఇక రాజమౌళి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మహేశ్ బాబు మూవీతో బిజీగా ఉన్నారు. వీరిద్దరి కాంబోలో యాక్షన్ అడ్వెంచరస్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
SIRAJ MIYAA… 🔥
What a spell!!!
Prasidh’s double blow!!!
India fights back at The Oval!!!
Test cricket… nothing comes close. 🥰🥰
Team India 🇮🇳🫡— rajamouli ss (@ssrajamouli) August 4, 2025