విరాట్‌ కోహ్లీ బయోపిక్‌లో తమిళ హీరో.. | Actor Simbu Play In VIRAT Kohli Biopic | Sakshi
Sakshi News home page

విరాట్‌ కోహ్లీకి ఇష్టమైన సాంగ్‌.. హీరోయిన్‌ పోటో లైక్‌పై క్లారిటీ

May 3 2025 8:36 AM | Updated on May 3 2025 10:11 AM

Actor Simbu Play In VIRAT Kohli Biopic

భారత క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీది ప్రత్యేక స్థానం. సచిన్, ధోనీల తరువాత ఆ స్థాయి భారత క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా నిర్వహించి పేరు గడించారు. విరాట్‌ కోహ్లీకి అశేష అభిమానులు ఉన్నారు. ఇకపోతే సినిమా రంగంలో సంచలన నటుడు శింబు. ఈయనలో మంచి నటుడే కాకుండా, దర్శకుడు, కథకుడు, సంగీతదర్శకుడు, గాయకుడు ఉన్నారు. అంతేకాకుండా శింబు బహు భాషా నటుడిగా పేరు తెచ్పుకున్నారు. ఇలాంటి నటుడి చిత్రంలోని పాటను క్రీడాకారుడు విరాట్‌ కోహ్లీ లూప్‌ మోడ్‌లో(పదేపదే) వినడం విశేషం. నటుడు శింబు  2023లో కథానాయకుడిగా నటించిన చిత్రం పత్తుతల. ఏఆర్‌.రెహా్మన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో 'నీ సింగం దాన్‌' అనే పాట చోటు చేసుకుంది. 

ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ ఐపీఎల్‌ పోటీల్లో బెంగళూరు జట్టు రాయల్‌ చాలెంజర్స్‌ తరఫున ఆడుతున్నారు. ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను   శింబు కథానాయకుడిగా నటించిన పత్తుతల చిత్రంలోని నీ సింగం దాన్‌ అనే పల్లవితో సాగే పాటను పదేపదే విన్నానని చెప్పారు. ఆయన ఇంటర్వ్యూతో కూడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇది శింబు దృష్టికి రావడంతో ఆయన కోహ్లీ నుద్దేశించి నీయే ఒరు సింగం దాన్‌ (నువ్వే ఒక సింహం) అని పేర్కొన్నారు. దీంతో కోహ్లీ అభిమానులు, శింబు అభిమానునలు క్రీడారంగంలోనూ, సినీ రంగంలోనూ ప్రముఖులైన ఇద్దరు ఒకరినొకరు ప్రశంసించుకుంటున్నారు. 

మరో విషయం ఏమిటంటే శింబు, కోహ్లీలో స్వారూప్యం చాలా ఉంది. ఇద్దరూ చార్మింగ్‌గా ఉంటారు. ఇద్దరూ పొడవైన జుట్టుతో ఉంటారు. దీంతో కోహ్లీ బయోపిక్‌లో శింబు నటించనున్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇంతకుముందు ధోని బయోపిక్‌తో తెరకెక్కిన ఎంఎస్‌.ధోని చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాబట్టి విరాట్‌ కోహ్లి బయోపిక్‌ తెరకెక్కే అవకాశం లేకపోలేదని, అందులో శింబు నటిస్తే అది కచ్చితంగా పాన్‌ ఇండియా చిత్రం అవుతుందనే వేరే చెప్పాల్సిన అవసరం ఉండదు. శింబు ప్రస్తుతం కమలహాసన్‌తో కలిసి నటించిన థగ్‌లైఫ్‌ చిత్రం జూన్‌ 5న తెరపైకి రానుంది. తాజాగా మరో మూడు చిత్రాలకు కమిట్‌ అయ్యారు. వీటిని పూర్తి చేసిన తరువాతనే  కోహ్లీ బయోపిక్‌లో నటించే అవకాశం ఉంటుంది.  

హీరోయిన్‌ లైక్‌పై క్లారిటీ
ఏప్రిల్ 30వ తేదీన నటి అవనీత్ కౌర్ కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్‌ చేసింది. అయితే, వాటిని  విరాట్ కోహ్లీ  లైక్ చేసినట్లు కొందరు నెటిజన్లు గమనించారు. కొంత సమయం తర్వాత ఆ లైక్‌ను ఆయన తొలగించారు. ఇంతలోనే కొందరు నెటిజన్లు ఆ స్క్రీన్‌షాట్లు తీసి సోషల్ మీడియాలో వైరల్‌ చేశారు. తాజాగా ఆ విషయంపై కోహ్లీ ఇలా వివరణ ఇచ్చారు. 'నేను ఇన్‌స్టాలోని ఫీడ్‌ను క్లియర్‌ చేస్తుండగా పొరపాటున లైక్‌ బటన్‌ ప్రెస్‌ అయి ఉంటుందని అనుకుంటున్నాను. ఈ విషయంలో ఎలాంటి ఉద్దేశం నాకు లేదు. ఎవరు కూడా అనవసర ఊహాగానాలు సృష్టించవద్దని కోరుతున్నాను. ఈ పొరపాటును  అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా' అని  తన ఇన్‌స్టా స్టోరీలో కోహ్లీ పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement