
మిల్కీ బ్యూటీ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న హీరోయిన్ తమన్నా. తెలుగులో దాదాపు స్టార్ హీరోల అందరి సరసన నటించింది. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం పెద్దగా కనిపించట్లేదు. ఈ ఏడాదిలో ఓదెల-2 మూవీతో అభిమానులను పలకరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్న తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తనపై వచ్చిన రూమర్స్పై క్లారిటీ ఇచ్చింది.
గతంలో పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో తమన్నా పెళ్లి అంటూ వచ్చిన కథనాలపై స్పందించింది. ఇలాంటి వార్తలు చాలా ఫన్నీగా అనిపించాయని గుర్తు చేసుకుంది. ఓ ఆభరణాల దుకాణం ప్రారంభోత్సవంలో అబ్దుల్ రజాక్‌తో కలిసి ఫోటో దిగడంతో ఇలాంటి రూమర్స్ వచ్చాయని తెలిపింది. తనకు కేవలం అబ్దుల్ రజాక్తో మాత్రమే కాదు.. విరాట్ కోహ్లీతోనూ తనకు ముడిపెట్టారని వివరించింది. నా జీవితంలో విరాట్ను కేవలం ఒక్కసారి మాత్రమే కలిశానని తమన్నా వెల్లడించింది. ఇలాంటి కథనాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా, బాధగా అనిపిస్తుందని పేర్కొంది. ఇలాంటి వాటిని మరిచిపోవడానికి కాస్తా సమయం పడుతుందని తెలిపింది.