ఇంగ్లండ్ యువ బ్యాటర్ బెన్ మేస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అండర్-19 వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఇంగ్లండ్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం జరుగుతున్న 2026 ఎడిషన్‌లో భాగంగా స్కాట్లాండ్‌తో ఇవాళ (జనవరి 21) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్‌లో మేస్ కేవలం 65 బంతుల్లో శతక్కొట్టి, మొత్తంగా 117 బంతుల్లో 191 పరుగులు చేశాడు. ఇందులో 18 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. మేస్ మరో రెండు పరుగులు చేసుంటే అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో ఏ జట్టు తరఫున అయిన అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించి ఉండేవాడు.
ఈ ప్రపంచ రికార్డు శ్రీలంక ఆటగాడు విరాన్ చముదిత పేరిట ఉంది. విరాన్ ఇదే ఎడిషన్‌లో జపాన్‌పై 192 పరుగుల చేశాడు. మేస్.. మరో శ్రీలంక ఆటగాడు హసిత బోయగోడాతో కలిసి ఈ విభాగంలో రెండో స్థానంలో నిలిచాడు. హసిత కూడా మేస్ లాగే 191 పరుగుల వద్ద ఆగిపోయాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 404 పరుగుల భారీ స్కోర్ చేసింది. మేస్ భారీ శతకంతో పాటు ఓపెనర్ జోసఫ్ మూర్స్ (81) అర్ద సెంచరీతో రాణించాడు.
లోయర్ మిడిలార్డర్ ఆటగాడు తలో చేయి వేయడంతో ఇంగ్లండ్ 400 పరుగుల మైలురాయిని తాకింది. కెప్టన్ థామస్ రూ 22, కాలెబ్ ఫాల్క్‌నర్ 32, రాల్ఫీ ఆల్బర్ట్ 13, ఫర్హాన్ అహ్మద్ 15 (నాటౌట్), సెబాస్టియన్ మోర్గాన్ 24 (నాటౌట్) పరుగులు చేశారు. మరో ఓపెనర్ బెన్ డాకిన్స్ 5 పరుగులకే ఔటయ్యాడు.
స్కాట్లాండ్ బౌలర్లలో జేక్ వుడ్‌హౌస్ 3 వికెట్లు పడగొట్టగా.. ఫిన్లే జోన్స్ 2, మ్యాక్స్ ఛాప్లిన్ ఓ వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్ తడబడుతుంది. 15 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు 48 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. మనూ సరస్వత్ (6), మ్యాక్స్ ఛాప్లిన్ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అలెక్స్ గ్రీన్, లూక్ హ్యాండ్స్, ఫర్హాన్ అహ్మద్‌కు తలో వికెట్ దక్కింది.
కాగా, ప్రస్తుత ఎడిషన్ ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించి బోణీ కొట్టింది. మరోవైపు స్కాట్లాండ్.. జింబాబ్వేతో ఆడాల్సిన తమ తొలి మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. రెండో మ్యాచ్‌లో ఆ జట్టు పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడింది.


