
మాంచెస్టర్: ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ సిటీలో దారుణంగా జరిగింది. యూదుల ప్రార్థనా మందిరం(సినగాగ్) వద్ద ఓ దుండగుడు దాడికి దిగాడు. సినగాగ్ బయట నిల్చున్నవారిపైకి గురువారం కారుతో దూసుకొచ్చాడు. అనంతరం కత్తితో దాడి చేశాడు.
ఈ ఘటనలో అడ్రియాన్ డల్బీ(53), మెల్విన్ క్రావిట్జ్(66) మరణించారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, మరణించిన ఇద్దరితో ఒకరు పోలీసుల కాల్పుల్లో మృతువాత పడినట్లు తెలిసింది. దుండుగుడిని అడ్డుకోవాలన్న ఉద్దేశంతో కాల్పులు జరపగా, ఒకరు మృతిచెందినట్లు గుర్తించారు. కానీ, తమ కాల్పుల్లో దుండగుడే హతమైనట్లు పోలీసులు చెబుతున్నారు.