
సౌతాఫ్రికా ఇంగ్లండ్‌కు మరో షాక్ ఇచ్చింది. ఇంగ్లండ్‌ను వారి దేశంలోనే వన్డే సిరీస్‌లో ఓడించిన (2-1తో) ఆ జట్టు.. తాజాగా టీ20 సిరీస్‌లోనూ ఆ దిశగా తొలి అడుగు వేసింది. నిన్న (సెప్టెంబర్ 10) జరిగిన తొలి మ్యాచ్‌లో అతిథ్య జట్టుపై సౌతాఫ్రికా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 14 పరుగులు తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
వర్షం అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 7.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఆలస్యం కావడంతో ఈ మ్యాచ్‌ను తొలుత 9 ఓవర్ల మ్యాచ్‌గా నిర్ణయించారు.
అయితే 7.5 ఓవర్ల తర్వాత వరుణుడు మరోసారి అడ్డుపడటంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ అక్కడే ముగించారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ (28), బ్రెవిస్ (23), డొనొవన్ ఫెర్రియెరా (25 నాటౌట్), స్టబ్స్ (13) ఉన్న పరిధిలో చెలరేగారు. ఇంగ్లండ్ బౌలర్లలో లూక్ వుడ్ 2, ఓవర్టన్, ఆదిల్ రషీద్, సామ్ కర్రన్ తలో వికెట్ తీశారు.
వర్షం కారణంగా మరి కాస్త సమయం వృధా కావడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఇంగ్లండ్ టార్గెట్‌ను 5 ఓవర్లలో 69 పరుగులకే కుదించారు. అయితే ఈ లక్ష్యాన్ని అందుకోవడంలో ఇంగ్లండ్ విఫలమైంది. 5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 54 పరుగులు మాత్రమే చేయగలిగింది.
సౌతాఫ్రికా బౌలర్లు వికెట్ల రూపంలోనే ఐదు బంతులు వేస్ట్ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టారు. జన్సెన్, కార్బిన్ బాష్ తలో 2, రబాడ ఓ వికెట్ తీశారు. ఛేదనలో తొలి బంతికే సాల్ట్‌ను రబాడ పెవిలియన్‌కు పంపాడు. ఆతర్వాత ఇంగ్లండ్ ఓవర్‌కు ఒకటి చొప్పున వికెట్లు కోల్పోయింది.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బట్లర్ (25), సామ్ కర్రన్ (10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ సిరీస్‌లో రెండో టీ20 మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 12న జరుగనుంది.