న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 29) జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. బ్లెయిర్ టిక్నర్ (8-1-34-4), నాథన్ స్మిత్ (5-0-27-2) చెలరేగడంతో 36 ఓవర్లలో 175 పరుగులకే ఆలౌటైంది. జేకబ్ డఫీ, జకరీ ఫౌల్క్స్, మిచెల్ సాంట్నర్, బ్రేస్‌వెల్ కూడా తలో వికెట్ తీసి ఇంగ్లండ్‌ను మట్టుబెట్టడంలో పాలుపంచుకున్నారు.
జేమీ ఓవర్టన్ (42), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖర్లో ఓవర్టన్ ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదాడు. వీరితో పాటు జేమీ స్మిత్ (13), జో రూట్ (25), జేకబ్ బేతెల్ (18), సామ్ కర్రన్ (17) రెండంకెల స్కోర్లు చేశారు. బట్లర్ (9) వైఫల్యాల పరంపరను కొనసాగించాడు.
కాగా, మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. వర్షం కారణంగా రెండు మ్యాచ్‌లు రద్దైన టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్ 1-0 తేడాతో కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది.
చదవండి: కాంట్రాక్టర్ నుంచి శ్రేయస్ దాకా.. మైదానంలో తీవ్రంగా గాయపడిన క్రికెటర్లు వీరే..!


