source: BCCI X
ఏషియన్ గేమ్స్ 2026లో క్రికెట్ పోటీల షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. పురుషుల విభాగంలో 10 జట్లు.. మహిళల విభాగంలో 8 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి.
పురుషుల విభాగం విషయానికొస్తే.. గ్రూప్-ఏలో ఆఫ్ఘనిస్తాన్, జపాన్, నేపాల్ జట్లు.. గ్రూప్-బిలో హాంగ్‌కాంగ్-చైనా, మలేషియా, ఒమన్ జట్లు పోటీపడనున్నాయి. సీడెడ్ జట్లైన భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు నేరుగా క్వార్టర్‌ఫైనల్స్‌కు అర్హత సాధించాయి.
భారత్, పాకిస్తాన్ జట్లు తమ తమ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో గెలుపొందితే అక్టోబర్ 1న జరిగే సెమీఫైనల్లో తలపడే అవకాశం ఉంది.
పురుషుల క్రికెట్ షెడ్యూల్
క్వాలిఫయర్స్
సెప్టెంబర్ 24- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ జపాన్
హాంకాంగ్-చైనా వర్సెస్ మలేషియా
సెప్టెంబర్ 25- హాంకాంగ్-చైనా వర్సెస్ ఒమన్
ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ నేపాల్
సెప్టెంబర్ 26- జపాన్ వర్సెస్ నేపాల్
మలేషియా వర్సెస్ ఒమన్
క్వార్టర్‌ఫైనల్స్
సెప్టెంబర్ 28 (తొలి క్వార్టర్ ఫైనల్)- పాకిస్తాన్ వర్సెస్ గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచే జట్టు
సెప్టెంబర్ 28 (రెండో క్వార్టర్ ఫైనల్)- భారత్ వర్సెస్ గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచే జట్టు
సెప్టెంబర్ 29 (మూడో క్వార్టర్ ఫైనల్)- శ్రీలంక వర్సెస్ గ్రూప్-ఏ విన్నర్
సెప్టెంబర్ 29 (నాలుగో క్వార్టర్ ఫైనల్)- బంగ్లాదేశ్ వర్సెస్ గ్రూప్-బి విన్నిర్
అక్టోబర్ 1- సెమీఫైనల్స్
అక్టోబర్ 3- కాంస్య పతక మ్యాచ్, ఫైనల్ |
మహిళల విభాగం విషయానికొస్తే.. భారత్, జపాన్, బంగ్లాదేశ్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఒక గ్రూపులో.. పాకిస్తాన్, శ్రీలంక, మలేషియా, థాయ్‌లాండ్ మరో గ్రూప్‌లో ఉన్నాయి. ఈ పోటీలు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌తో మొదలవుతాయి.
సెప్టెంబర్ 17- క్వార్టర్ ఫైనల్ 1- బంగ్లాదేశ్ వర్సెస్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా
క్వార్టర్ ఫైనల్ 2- పాకిస్తాన్ వర్సెస్ థాయ్‌లాండ్
సెప్టెంబర్ 18- క్వార్టర్ ఫైనల్ 3- శ్రీలంక వర్సెస్ మలేషియా
క్వార్టర్ ఫైనల్ 4- భారత్ వర్సెస్ జపాన్
సెప్టెంబర్ 20- సెమీఫైనల్స్ (1,2)
సెప్టెంబర్ 22- కాంస్య పతకం మ్యాచ్, ఫైనల్స్
చదవండి: బ్రెజిల్‌కు ముందు మరో ప్రపంచకప్ జట్టుతో భారత్ మ్యాచ్


