Sri Lanka Vs India 2nd Test Match, Day 4:
ఫాలో ఆన్.. తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక
ఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో సరాన్ష్ జైన్‌కు క్యాచ్ ఇచ్చి ఉదారా (3) ఔటాయ్యడు.
ఫాలో ఆన్ ఆడనున్న శ్రీలంక
దినుషా సెంచరీతో పోరాడినప్పటికీ శ్రీలంకను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించలేకపోయాడు. 213 పరుగులు వెనుకపడి ఉన్న శ్రీలంక రెండో ఇన్నింగ్స్ కొనసాగించనుంది.
దినుషా సెంచరీ.. శ్రీలంక ఆలౌట్
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 290 పరుగుల వద్ద ముగిసింది. సెంచరీ హీరో దినుషా (103) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. దినుషా సరాన్ష్ జైన్ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
తొమ్మిదో వికెట్ కోల్పోయిన శ్రీలంక
86.5వ ఓవర్- 288 పరుగుల వద్ద శ్రీలంక తొమ్మిదో వికెట్ కోల్పోయింది. సరాన్ష్ జైన్ బౌలింగ్‌లో జురెల్‌కు క్యాచ్ ఇచ్చి లహీరు కుమార (12) ఔటయ్యాడు.
సెంచరీ పూర్తి చేసిన దినుషా
ఓవర్‌నైట్ బ్యాటర్ సోనల్ దినుషా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో బౌండరీతో మూడంకెల మార్కును దాటాడు. దినుషాకు ఇది వరసగా రెండో సెంచరీ. ఈ సిరీస్ తొలి టెస్ట్‌లోనూ అతడు సెంచరీ చేశాడు.
నాలుగో రోజు మొదలైన ఆట
ఓవర్‌నైట్ స్కోర్ (శ్రీలంక తొలి ఇన్నింగ్స్) 265-8 వద్ద నాలుగో రోజు ఆట మొదలైంది. దినుష (85), లహీరు కుమార (8) ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు.
భారీ ఆధిక్యంలో భారత్
మూడో రోజు నిలిచే సమయానికి శ్రీలంక 83.4 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు సాధించింది. సొనాల్ దినుష 85 పరుగులు, లాహిరు కుమార 8 పరుగులతో అజేయంగా నిలిచారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే శ్రీలంక ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది. లంక ఇన్నింగ్స్‌లో పసిందు సూరియబండార (80) అర్ద సెంచరీతో రాణించగా.. భారత్ తరఫున ప్రసిద్ద్, సుతార్ తలో 3 వికెట్లు తీశారు.
పడిక్కల్, జురెల్ సెంచరీలు
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 503 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. పడిక్కల్ (117), ధ్రువ్ జురెల్ (115 నాటౌట్) శతకాలతో విజృంభించగా.. గిల్ (50), పంత్ (63) అర్ధసెంచరీలతో రాణించారు.
చదవండి: శాసించేది మనమే!


