breaking news
indian airforce officer
-
కొత్త కెరీర్‌ను ప్రారంభించిన అభినందన్ వర్ధమాన్
2019లో జరిగిన వైమానిక ఘర్షణలో పాకిస్తాన్‌కు చెందిన ఓ శత్రు విమానాన్ని కూల్చివేసిన మాజీ భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్, వీర్ చక్ర అవార్డు గ్రహీత అభినందన్ వర్ధమాన్ కొత్త కెరీర్‌ను ప్రారంభించారు. ఆయన గోవాకు చెందిన ప్రాంతీయ విమానయాన సంస్థ FLY91లో పైలట్‌గా చేరినట్లు వార్తాలు వస్తున్నాయి. అభినందన్ గత నెలలోనే FLY91లో చేరినట్లు సమాచారం. FLY91 ప్రస్తుతం ATR 72-600 విమానాలను నడుపుతోంది. గోవా, హైదరాబాద్‌లలో FLY91కు రెండు బేస్‌లు ఉన్నాయి.2019 ఫిబ్రవరి 27న పాకిస్తాన్‌తో జరిగిన వైమానిక ఘర్షణలో అభినందన్ మిగ్-21 బైసన్‌ను నడిపారు. ఆయన విమానం కూలిపోవడంతో పాకిస్తాన్ భూభాగంలో దిగిన ఆయనను పాక్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. మూడు రోజుల తర్వాత ఆయన భారత్‌కు తిరిగి వచ్చారు. ఈ ఘటనలో చూపిన ధైర్యసాహసాలకు అభినందన్ వర్ధమాన్ 2021లో వీర్ చక్ర పురస్కారం అందుకున్నారు.అభినందన్ మిగ్-21 ఫైటర్ జెట్ నుంచి ATR-72 ప్యాసింజర్ విమానం వైపు అడుగులు మార్చడం ఆసక్తికరంగా మారింది. అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం, ఆయన ATR విమానంపై అవసరమైన శిక్షణ పొందుతున్నారని, శిక్షణ మరియు నియంత్రణ అనుమతులు పూర్తయ్యాక వాణిజ్య విమాన సర్వీసుల్లోకి రావచ్చు.చదవండి: ఢిల్లీలో వైఎస్సార్ అవార్డ్స్-2026 ప్రదానోత్సవం -
డ్రగ్స్ రాకెట్లో వైమానిక దళం అధికారి!
-
డ్రగ్స్ రాకెట్లో వైమానిక దళం అధికారి!
బెంగళూరులో బయటపడిన డ్రగ్ రాకెట్ విస్తృతి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పనిచేస్తున్న జి.రాజశేఖరరెడ్డి అనే మరో వ్యక్తిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఈ కేసులో అరెస్టు చేశారు. ఇప్పటికే వెంకట రామారావు అనే శాస్త్రవేత్తతో పాటు ఆయన భార్య ప్రీతిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారి నుంచి రూ. 231 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. యాంఫెటమైన్ అనే డ్రగ్‌ను ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో యువత చాలా ఫ్యాషనబుల్‌గా భావిస్తుంది. ఈ డ్రగ్‌ను స్మగ్లింగ్ చేయడంలో వింగ్ కమాండర్ రాజశేఖరరెడ్డి కూడా భాగస్తుడని ఎన్సీబీ వర్గాలు చెబుతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్ ప్రధాన కేంద్రాలుగా సాగుతున్న ఈ డ్రగ్ రాకెట్ గురించి ఎన్సీబీ వర్గాలు వివరాలు సేకరించి, రాజశేఖరరెడ్డిని అరెస్టు చేసే సమయానికి అతడు గోవా పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. (చదవండి: శాస్త్రవేత్త అరెస్టు.. రూ. 231 కోట్ల డ్రగ్స్ స్వాధీనం) మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేసియాలతో పాటు కొన్ని పాశ్చాత్య దేశాలకు కూడా యాంఫెటమైన్ స్మగ్లింగ్ చేయడంలో రాజశేఖరరెడ్డిది కీలకపాత్ర అని అంటున్నారు. చాలాకాలం పాటు బెంగళూరులో పనిచేసిన అతడికి.. ఆ తర్వాత వైమానిక దళం ప్రధాన కార్యాలయంలో పోస్టింగ్ వచ్చింది. ఈ కేసులో మరికొందరు వైమానిక దళం మాజీ అధికారులు కూడా ఉండే అవకాశం ఉందని, వాళ్లందరి పేర్లు త్వరలోనే బయటకు వస్తాయని అంటున్నారు. గత కొన్నేళ్లుగా వీళ్లందరి సెల్ఫోన్ల కాల్ రికార్డులు ఎలా ఉన్నాయనే విషయాన్ని కూడా అధికారులు సేకరించనున్నారు.


