డ్రగ్స్ రాకెట్‌లో వైమానిక దళం అధికారి! | serving indian air force officer held in international drugs racket | Sakshi
Sakshi News home page

డ్రగ్స్ రాకెట్‌లో వైమానిక దళం అధికారి!

Oct 5 2016 10:57 AM | Updated on May 25 2018 2:29 PM

డ్రగ్స్ రాకెట్‌లో వైమానిక దళం అధికారి! - Sakshi

డ్రగ్స్ రాకెట్‌లో వైమానిక దళం అధికారి!

బెంగళూరులో బయటపడిన డ్రగ్ రాకెట్ విస్తృతి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పనిచేస్తున్న జి.రాజశేఖరరెడ్డి అనే మరో వ్యక్తిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు ఈ కేసులో అరెస్టు చేశారు.

బెంగళూరులో బయటపడిన డ్రగ్ రాకెట్ విస్తృతి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పనిచేస్తున్న జి.రాజశేఖరరెడ్డి అనే మరో వ్యక్తిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు ఈ కేసులో అరెస్టు చేశారు. ఇప్పటికే వెంకట రామారావు అనే శాస్త్రవేత్తతో పాటు ఆయన భార్య ప్రీతిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారి నుంచి రూ. 231 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. యాంఫెటమైన్ అనే డ్రగ్‌ను ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో యువత చాలా ఫ్యాషనబుల్‌గా భావిస్తుంది. ఈ డ్రగ్‌ను స్మగ్లింగ్ చేయడంలో వింగ్ కమాండర్ రాజశేఖరరెడ్డి కూడా భాగస్తుడని ఎన్‌సీబీ వర్గాలు చెబుతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్ ప్రధాన కేంద్రాలుగా సాగుతున్న ఈ డ్రగ్ రాకెట్ గురించి ఎన్‌సీబీ వర్గాలు వివరాలు సేకరించి, రాజశేఖరరెడ్డిని అరెస్టు చేసే సమయానికి అతడు గోవా పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. (చదవండి:  శాస్త్రవేత్త అరెస్టు.. రూ. 231 కోట్ల డ్రగ్స్ స్వాధీనం)

మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేసియాలతో పాటు కొన్ని పాశ్చాత్య దేశాలకు కూడా యాంఫెటమైన్ స్మగ్లింగ్ చేయడంలో రాజశేఖరరెడ్డిది కీలకపాత్ర అని అంటున్నారు. చాలాకాలం పాటు బెంగళూరులో పనిచేసిన అతడికి.. ఆ తర్వాత వైమానిక దళం ప్రధాన కార్యాలయంలో పోస్టింగ్ వచ్చింది. ఈ కేసులో మరికొందరు వైమానిక దళం మాజీ అధికారులు కూడా ఉండే అవకాశం ఉందని, వాళ్లందరి పేర్లు త్వరలోనే బయటకు వస్తాయని అంటున్నారు. గత కొన్నేళ్లుగా వీళ్లందరి సెల్‌ఫోన్ల కాల్ రికార్డులు ఎలా ఉన్నాయనే విషయాన్ని కూడా అధికారులు సేకరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement