శాస్త్రవేత్త అరెస్టు.. రూ. 231 కోట్ల డ్రగ్స్ స్వాధీనం | scientist and wife aarested with rs 231 crore worth drugs | Sakshi
Sakshi News home page

శాస్త్రవేత్త అరెస్టు.. రూ. 231 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

Oct 4 2016 8:47 AM | Updated on Sep 7 2018 2:20 PM

శాస్త్రవేత్త అరెస్టు.. రూ. 231 కోట్ల డ్రగ్స్ స్వాధీనం - Sakshi

శాస్త్రవేత్త అరెస్టు.. రూ. 231 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

వాళ్లిద్దరూ భార్యభార్తలు. ఇద్దరూ కలిసి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. ఒకటి, రెండు కాదు.. అంతర్జాతీయ మార్కెట్‌లో ఏకంగా రూ. 231 కోట్ల విలువైన యాంఫెటమైన్ అనే డ్రగ్‌ను వాళ్ల దగ్గర నార్కొటిక్స్ విభాగానికి చెందిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వాళ్లిద్దరూ భార్యభార్తలు. ఇద్దరూ కలిసి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. ఒకటి, రెండు కాదు.. అంతర్జాతీయ మార్కెట్‌లో ఏకంగా రూ. 231 కోట్ల విలువైన యాంఫెటమైన్ అనే డ్రగ్‌ను వాళ్ల దగ్గర నార్కొటిక్స్ విభాగానికి చెందిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో విచిత్రం ఏమిటంటే, దంపతుల్లో భర్త ఒక పరిశోధక శాస్త్రవేత్త. మానసిక వైద్య చికిత్సలో భాగంగా ఈ మందును ఉపయోగిస్తారు. కానీ, దాన్ని డ్రగ్‌గా ఇటీవలి కాలంలో భారతీయ యువత విచ్చలవిడిగా వాడుతున్నట్లు నార్కొటిక్స్ బ్యూరో తెలిపింది. ఈ డ్రగ్‌ను ఎక్కువగా ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాలకు భారతదేశం నుంచి స్మగుల్ చేస్తారు. హైదరాబాద్, బెంగళూరు కేంద్రాలుగా ఓ భారీ డ్రగ్ నెట్‌వర్క్ నడుస్తోందని అధికారులు వెల్లడించారు.

ప్రముఖ సంస్థలో పరిశోధక శాస్త్రవేత్తగా పనిచేస్తున్న వెంకట రామారావు (37)ను సెప్టెంబర్ 30వ తేదీన పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. తనతోపాటు వ్యాపారంలో ఉన్న రవిశంకర్ రావు (22) నుంచి డ్రగ్స్ తీసుకుంటుండగా పట్టుకున్నారు.  వాళ్ల వద్ద ఆ సమయంలో దాదాపు 221 కిలోల యాంఫెటమైన్ ఉంది. తన ఇంట్లో మరిన్ని డ్రగ్స్ ఉన్నాయని విచారణలో రామారావు వెల్లడించాడు. బెంగళూరులోని అతడి ఇంటిని గాలించగా, భార్య ప్రీతి (35) మరో 30 కిలోల యాంఫెటమైన్‌ను దాచి ఉంచినట్లు తేలింది. దాన్ని అతడు బయ్యర్లకు శాంపిల్‌గా ఇచ్చేవాడు. దాంతోపాటు ఇంట్లో మరో రూ. 1.23 కోట్ల నగదు కూడా ఉంది. తర్వాత ఈ డ్రగ్‌ను ప్రాసెస్ చేస్తున్న ఓ ల్యాబ్ నుంచి ఇంకో 10 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇంకా చాలామంది హస్తం ఉండి ఉంటుందని, ఇది ఒకరిద్దరి వల్ల అయ్యేది కాదని నార్కొటిక్స్ బ్యూరో అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement