మిస్సిసాగా: కెనడాలోని మిస్సిసాగా నగరంలో శనివారం(సెప్టెంబర్ 5వ తేదీ) సాయంత్రం 6 గంటలకు వైఎస్సార్‌సీపీ కెనడా విభాగం ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్ ప్రజా సేవ, సంక్షేమ పథకాలు, నాయకత్వ పటిమ, ప్రజల పట్ల ఆయన చూపిన నిబద్ధతను నేతలు, కార్యకర్తలు ఘనంగా స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమం వైఎస్సార్‌సీపీ కెనడా అడ్వైజర్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో, వైఎస్సార్‌సీపీ కెనడా కన్వీనర్ వేణు చుక్కలూరు గారి సమన్వయంతో విజయవంతంగా నిర్వహించబడింది.
కార్యక్రమ నిర్వాహకులు (వైఎస్సార్‌సీపీ కెనడా టీమ్):
* సుబ్బారావు – వైఎస్సార్‌సీపీ కెనడా కో-కన్వీనర్
* నూర్ గారు – వైఎస్సార్‌సీపీ కెనడా యూత్ వింగ్ కన్వీనర్
ముఖ్య అతిథులు మరియు వక్తలు
చల్లా మధుసూదన్ రెడ్డి గారు (వైఎస్సార్‌సీపీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ) – జూమ్ ద్వారా హాజరయ్యారు
పాండుగాయల రత్నాకర్ గారు (మాజీ వైఎస్సార్‌సీపీ యూఎస్‌ఏ/ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్, ఏపీ ప్రభుత్వ మాజీ నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి) – జూమ్ ద్వారా హాజరయ్యారు.

డాక్టర్ ప్రదీప్ చింత గారు (వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి - ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు) – జూమ్ ద్వారా హాజరయ్యారు. కొండం వెంకట్ రెడ్డి గారు (కెనడా కమ్యూనిటీ నాయకులు) – ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దూరదృష్టి, పేదలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి, ప్రజాసేవలో ఆయన చూపిన అంకితభావాన్ని కొనియాడారు.
ఎగ్జిక్యూషన్ టీమ్: కార్యక్రమ నిర్వహణ, వేదిక ఏర్పాట్లు, సమన్వయంలో కీలక పాత్ర పోషించిన సభ్యులు: అస్లాం, సుమంత్, యశ్వంత్ నిమ్మకాయల, గోపిరెడ్డి కృష్ణారెడ్డి, పురుషోత్తం రెడ్డి, కృష్ణ, ఆరిఫ్, డాక్టర్ నిరంజన్ చుక్కలూరు, సుబ్బారెడ్డి దుగంపూడి, శ్రీనివాస్ కొరపోరలు.
అడ్వైజర్ కమిటీ: కార్యక్రమానికి విలువైన మార్గదర్శకత్వం అందించిన సలహాదారుల కమిటీ సభ్యులు:
* కృష్ణారెడ్డి పసల
* రాజగోపాల్ గుంటక
* విశ్వనాథ్ రెడ్డి
* విజయభాస్కర్ రెడ్డి
* కృష్ణ ఆలంపాటి
* డాక్టర్ శివ రెడ్డి
ఈ కార్యక్రమంలో మిస్సిసాగాతో పాటు పరిసర ప్రాంతాల నుండి వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో చురుకైన పాత్ర పోషించిన కోర్ కమిటీ సభ్యులందరికీ, ఎగ్జిక్యూషన్ టీమ్‌కు, అడ్వైజర్ కమిటీ సభ్యులకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.


