వాషింగ్టన్: అమెరికాలోని న్యూజెర్సీ, ప్లెయిన్స్‌బోరో టౌన్‌షిప్‌లోని పేపర్ హౌస్ వేదికగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సభ ఘనంగా జరిగింది. వైఎస్సార్‌సీపీ యూఎస్‌ఏ కమిటీ ఆధ్వర్యంలో మహానేత - వైఎస్సార్ లైవ్స్ ఆన్ పేరిట నిర్వహించిన ఈ స్మరణ కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు, వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ చల్లా మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి విప్లవాత్మక సంక్షేమ పథకాలు తెలుగు ప్రజల గుండెల్లో ఆయనను చిరస్థాయిగా నిలిపాయని కొనియాడారు. వైఎస్సార్ ఆశయాల సాధనకు, ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రవాసాంధ్రులంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పాల్గొన్న సభ్యులు వైఎస్సార్‌తో తమకున్న అనుబంధాన్ని, ఆయన పాలనా విశేషాలను గుర్తుచేసుకున్నారు.


