సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దెబ్బకు సీఎం చంద్రబాబు దిగొచ్చారు. ఎట్టకేలకు కరువుపై కేబినెట్‌లో చర్చ జరిపారు. ఇటీవలే ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ నిలదీసిన సంగతి తెలిసిందే. దీంతో కరువుపై కేంద్రానికి లేఖ రాస్తానంటూ చంద్రబాబు ప్రకటించారు. ఏపీలో దుర్భర పరిస్థితులు ఉన్నాయని చంద్రబాబు అంగీకరించారు.
దేశమంతా 14 శాతం లోటు వర్షపాతం ఉండగా.. ఏపీలో మాత్రం 52 శాతం లోటు వర్షపాతం ఉన్నట్టు వెల్లడించారు. జలాశయాల్లో నీళ్లున్నా.. రైతులకు ప్రభుత్వం విడుదల చేయలేదు. నీళ్లివ్వలేమంటూ కేబినెట్‌లో చంద్రబాబు వ్యాఖ్యానించారు. విమర్శలు చేస్తున్నవారిపై ఎదురుదాడి చేయాలంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.
ఏపీ కేబినెట్‌లో ప్రోటోకాల్‌పై హైడ్రామా
ఏపీ కేబినెట్‌లో ప్రోటోకాల్‌పై హైడ్రామాకు తెరతీశారు. అధికారులను సీఎం మందలించినట్టు లీకులు ఇచ్చారు. వెలిగొండ, పోలవరం ప్రకటనల్లో రామానాయుడు ఫొటో కానరాలేదు. రామానాయుడు ఫొటో తీసేసి నారా లోకేష్ ఫొటో ముద్రించారు. లోకేష్‌ని ప్రమోట్ చేయడానికి టీడీపీ ప్లాన్ చేసింది. విషయం బట్టబయలు కావడంతో సీఎం చంద్రబాబు డ్రామా మొదలుపెట్టారు. తప్పంతా అధికారులపై నెట్టేసి తిట్టినట్టు లీకులు ఇచ్చారు.


