సాక్షి,అమరావతి: ఏపీ మంత్రివర్గ సమావేశంలో తీవ్ర ప్రోటోకాల్ రగడ కలకలం రేపింది. వెలిగొండ, పోలవరం ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటనలు, పోస్టర్లలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఫొటోను పక్కనబెట్టడం తీవ్ర వివాదానికి దారితీసింది. మంత్రి ఫొటో స్థానంలో లోకేష్ ఫొటోను ముద్రించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిమ్మల రామానాయుడు ఫొటో లేకుండా, లోకేష్‌ను ప్రమోట్ చేసే వ్యూహంలో భాగంగానే ఈ మార్పులు చేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యవహారం రచ్చకెక్కడంతో, నష్టనివారణ చర్యల్లో భాగంగా చంద్రబాబు అధికారులపై మందలింపుల డ్రామా మొదలుపెట్టారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ అనుకూల మీడియా ద్వారా లీకులు ఇప్పిస్తూ, తప్పును అధికారులపైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు.


