
దులీప్ ట్రోఫీ-2025లో భాగంగా బెంగళూరు వేదికగా నార్త్ జోన్, సౌత్ జోన్ మధ్య జరిగిన తొలి సెమీఫైనల్ డ్రా ముగిసింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో లీడ్ ఆధారంగా సౌత్ జోన్ జట్టు ఫైనల్‌కు ఆర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నార్త్ జోన్ కెప్టెన్ అంకిత్ కుమార్ తొలుత సౌత్ జోన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్హనించాడు. ఈ క్రమంలో మొహమ్మద్ అజారుద్దీన్ సారథ్యంలోని సౌత్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 536 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
సౌజ్ జోన్ బ్యాటర్లలో నారయణ్ జగదీశన్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన జగదీశన్ తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. మొత్తంగా 352 బంతులు ఎదుర్కొన్న జగదీశన్.. 16 ఫోర్లు, 2 సిక్స్‌లతో 197 పరుగులు చేశాడు.
అతడితో పాటు జగదీశన్‌తో పాటు దేవదత్ పడిక్కల్ (71 బంతుల్లో 57; 7 ఫోర్లు), రికీ భుయ్(54) తన్మయ్ అగర్వాల్ (99 బంతుల్లో 43; 5 ఫోర్లు) రాణించారు. నార్త్‌జోన్ బౌలర్లలో నిశాంత్ సింధు 5, అన్షుశ్ కంబోజ్ రెండు వికెట్లు వికెట్ తీశారు. అనంతరం నార్త్‌జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 361 పరుగులకు ఆలౌటైంది. 258/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ఆరంభించిన నార్త్‌జోన్.. అదనంగా 103 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను ముగించింది.
నార్త్‌జోన్ బ్యాటర్లలో శుభమ్ కజురియా(28) సెంచరీతో కదం తొక్కాడు. అతడితో నిశాంత్ సింధు 82 పరుగులతో రాణించాడు. సౌత్‌జోన్ పేసర్ గుర్‌జప్‌నీత్ సింగ్ (4/96) టాపార్డర్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. అతడితో పాటు నిదేశ్ మూడు, టి త్యాగరాజన్, కౌశిక్ తలా వికెట్ సాధించారు.
దీంతో తొలి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్‌కు 175 పరుగుల ఆధిక్యం లభించింది. ఆతర్వాత సెకెండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన సౌత్ జోన్ వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. ఈ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు డ్రా అంగీకరించడంతో ఆట నిర్ణీత సమయం కంటే ముందే ముగిసిపోయింది. జగదీశన్‌కు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది.
చదవండి: Duleep Trophy 2025: ఆసియా కప్ జట్టులో నో ప్లేస్.. సత్తా చాటిన యశస్వి జైస్వాల్