
ఆసియా కప్ 2025 ప్రధాన జట్టులో (స్టాండ్‌బైగా ఎంపిక) చోటు దక్కించుకోలేకపోయిన టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దులీప్ ట్రోఫీలో సత్తా చాటాడు. ఈ టోర్నీలో వెస్ట్ జోన్‌కు ఆడుతున్న జైస్వాల్.. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో రాణించాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా (4).. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మెరుపు అర్ద సెంచరీతో (70 బంతుల్లో 64; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరిశాడు.
రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ రాణించినా అతని జట్టు చేతుల్లో నుంచి మ్యాచ్ జారిపోయేలా కనిపిస్తుంది. సెంట్రల్ జోన్ బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించారు. ఒక వేళ మ్యాచ్ డ్రా అయిన పక్షంలో తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగానే విజేతను నిర్ణయిస్తారు. అదే జరిగితే సెంట్రల్ జోన్ ఫైనల్స్‌కు చేరుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో 600 పరుగులు చేసిన సెంట్రల్ జోన్ 162 పరుగుల కీలక ఆధిక్యాన్ని సాధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్ జోన్.. రుతురాజ్ గైక్వాడ్ (184) భారీ సెంచరీతో కదంతొక్కడంతో 438 పరుగులు చేసింది. తనుశ్ కోటియన్ (76), కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ (64) అర్ద సెంచరీలతో రాణించారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జోన్.. ఒక్క ఆటగాడు కూడా సెంచరీ చేయకపోయినా 600 పరుగుల భారీ స్కోర్ చేసింది. దనిశ్ మాలేవార్ (76), షుభమ్ శర్మ (96), కెప్టెన్ రజత్ పాటిదార్ (77), ఉపేంద్ర యాదవ్ (87), హర్ష్ దూబే (75), సరాన్ష్ జైన్ (63 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు.
162 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్ట్ జోన్ నాలుగో రోజు రెండో సెషన్ సమయానికి 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో రుతురాజ్ (16) విఫలం కాగా.. తనుశ్ కోటియన్ (1), షమ్స్ ములానీ (1) క్రీజ్‌లో ఉన్నారు. సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు వెస్ట్ జోన్ ఇంకా 30 పరుగులు వెనుకపడి ఉంది.